Hyderabad: ముఖ్య అతిథిగా బిఎస్ఎఫ్ డిజి దల్జీత్ సింగ్ చౌదరి (Daljit Singh Chaudhary) తెలంగాణకు నలుగురు, ఎపికి ఐదుగురి కేటాయింపు హైదరాబాద్, : యువ ప్రొబేషనరీ ఐపిఎస్ అధికారుల దీక్షాంత్ పరేడ్ శుక్రవారం జరగనుంది. నగరంలోని శివరాంపల్లిలో గల సర్దార్ వల్లభ బాయి పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరగనున్న ఈ దీక్షాంత్ పరేడ్కు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డిజి దల్టీత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరు బుధవారం మీడియాతో మాట్లాడుతున్న అమిత్గార్గ్ కానున్నారు. 77వ బ్యాచ్ ఐపిఎస్ అధికారులు పాల్గొననున్న ఈ దీక్షాంత్ పరేడ్ కోసం ఇప్పటికే పోలీసు అకాడమీ ముస్తాబయ్యింది. మొత్తం 190 మంది అధికారులు పాల్గొంటున్న ఈ పరేడ్లో 174 మంది ఐపిఎస్ అధికారులు కాగా మిగతా 16 మంది విదేశీ అధికారులున్నారు. మొత్తం అధికారుల్లో 65 మంది మహిళా అధికారులున్నారు. యువ ఐపిఎస్ అధికారులకు 45 వారాల పాటు కఠిన శిక్షణ ఇచ్చినట్లు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆకాడమి డైరక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. శిక్షణలో భాగంగా బేసిక్ కోర్సుతో పాటు అవుట్ డోర్, ఇండోర్ విభాగాలలో, సైబర్ భద్రత, అంతర్గత భద్రతపై నిపుణులచేత అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో యువ అధికారులకు పది వారాల సునిశిత కఠిన శిక్షణ ఇచ్చామని, ఈ పదివారాలు గ్రే హౌండ్స్ పాటు సాయుధ బలగాలు, పారా మిలటరీ బలగాలు, మిలటరీలో వివిధ విభాగాలలో వీరంతా తర్పీదును పొందారని అమిత్ గార్గ్ తెలిపారు.
TG: విస్తృతంగా వ్యవసాయ విద్య, పరిశోధనలు
Hyderabad
Hyderabad హైదరాబాద్లో ఇటీవల జరిగిన గణేష్ వేడుకలతో పాటు మొహరం బందోబస్తులో యువ అధికారులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ పోలీసు విభాగంలో కొనసాగుతున్న పలు ఉప విభాగాలను వీరు సందర్శించి అనుభవం గడించారని ఆయన వెల్లడించారు. ఈ ఏడాదికి గానూ తెలంగాణకు నలుగురు ఎపికి ఐదుగురు అధికారులను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా ఐపిఎస్ అభ్యర్థుల్లో తొలిసారిగా 36శాతం మంది మహిళలు వున్నారని అమిత్ గార్గ్ తెలిపారు. ఇది ఒక రికార్డు అని ఆయన వెల్లడించారు. గత ఏడాది 29 శాతం, 2023లో 21 శాతం, వుండగా ఈ ఏడాది 36 శాతం మంది మహిళలు వుండడం గొప్పగా వుందని ఆయన తెలిపారు. ఈసారి జరిగే దీక్షాంత్ పరేడ్లో ఐపిఎస్కు ఎంపికైన వారిలో యుపి నుంచి ఆ త్యధికంగా 20 మంది, రాజస్తాన్ నుంచి 11 మంది వున్నారని, తెలంగాణ నుంచి ఇద్దరు, ఎపి నుంచి ముగ్గురు వున్నారని అమిత్ గార్గ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆకాడమి జాయింట్ డైరక్టర్ శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఏడుగురు యువ ఐపిఎస్లు తమ అనుభవాలను పంచుకున్నారు.
ఐపీఎస్ ప్రొబేషనరీల దీక్షాంత్ పరేడ్ ఎప్పుడు జరగనుంది?
రేపు (శుక్రవారం) హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ పరేడ్ జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరు?
బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: