రెండేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య పాపం! ఆ తల్లికి ఏం కష్టం వచ్చిదో ఏమో తెలియదు. చిన్నవయసులోనే తనువు చాలించింది. పోతూపోతూ తనతో పాటూ తన రెండేళ్ల చిన్నారిని కూడా మృత్యువుకు(Hyderabad Crime) చేరువచేసింది. సంసారం అన్నాక కష్టాలు, బాధలు ఉంటాయి. కన్నీరు ఆనందాలు కూడా ఉంటాయి. కానీ కొందరికి సుదూరతీరాలకు సైతం ఆనందఛాయలు ఉంటాయని ఆశ ఉండదు. అలాంటి వేదనాభరితమైన జీవితం వారికి ఉంటుంది. భర్త, అత్తామామల వేధింపులు, వరకట్న దాహాలకు ఎందరో మహిళలు ఆహుతి అవుతున్నారు. బాధ ఏదైనా దానికి పరిష్కరం చావేశరణ్యంగా భావిస్తుండడం వల్లే ఇటీవల ఆత్మహత్యలు(suicide) పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ తల్లి తన చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ కు జకీర్ నాయక్ కు నో ఎంట్రీ
హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య
హైదరాబాద్(Hyderabad Crime) లోని పాతబస్తీలో నివాసముంటున్న పృథ్విలాల్ చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఇతని భార్య కీర్తి అగర్వాల్ (28) తన రెండేళ్ల కూతురురిని తీసుకుని ఈనెల 2వ తేదీని ఆత్మహత్యకు పాల్పడింది. దీని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కీర్తన ఆగర్వాల్ మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ఆమె రెండేళ్ల కుమార్తె కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సాగర్ లో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మంగళవారం పాప మృతదేహం కూడా లభ్యమైంది. కుటుంబ కలహాలతోనే కీర్తిక అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గురించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బోసినవ్వులు నవ్వే ఆ చిన్నారి.. తల్లి ఒడిలో నుంచి మృత్యువుకు చేరువైన చిన్నారి, తల్లిని చూసి కుటుంబసభ్యులు దుఖసాగరంలో మునిగిపోయారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: