📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Hyderabad: ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు

Author Icon By Tejaswini Y
Updated: January 21, 2026 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రయాణం

హైదరాబాద్(Hyderabad) నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను ఒకే సమగ్ర వ్యవస్థగా అనుసంధానించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఈ చర్యల ద్వారా ప్రయాణికులకు ఫస్ట్ మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడంతో పాటు నగర రహదారులపై ట్రాఫిక్ భారం తగ్గించడమే ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

Read Also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్‌

Hyderabad: Check traffic tension.. Three services with one ticket

ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో మార్పులు

సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వికాస్ రాజ్, నగరంలోని మొత్తం 51 ఎంఎంటీఎస్(MMTS) స్టేషన్ల చుట్టుపక్కల ఉన్న అనుసంధాన రహదారులను అభివృద్ధి చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఎంఎంటీఎస్ స్టేషన్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు జీహెచ్‌ఎంసీ మరియు ఆర్టీసీకి అందజేస్తారని తెలిపారు.

ఒకే టికెట్‌తో ప్రయాణించే వీలుగా సమగ్ర టికెటింగ్

ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బస్ స్టాప్‌లను రైల్వే స్టేషన్లకు మరింత సమీపంగా తరలించడంతో పాటు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు మార్గాలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు వెల్లడించారు. అదనంగా, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప నివాస ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేట్ ఫీడర్ సర్వీసులను ప్రారంభించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ముఖ్యంగా మెట్రో రైలు, ఎంఎంటీఎస్ మరియు ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించే వీలుగా సమగ్ర టికెటింగ్ విధానంపై అధ్యయనం చేయాలని మీ–సేవ కమిషనర్‌కు సూచించినట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే హైదరాబాద్‌లో ఆధునిక మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ ఏర్పాటు దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Hyderabad Metro Hyderabad public transport MMTS Multimodal Transport System TGSRTC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.