📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

Telugu News: HYD: దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకంటే?

Author Icon By Sushmitha
Updated: December 12, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సస్పెన్షన్‌కు గురైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) మరియు ఆయన భార్య దివ్వెల మాధురి (diveela madhuri) మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. బర్త్‌డే ఫంక్షన్ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందుకు గాను వారిని హైదరాబాద్ ఎస్ఓటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.

Read Also:  AP: అమరావతిలో కాగ్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి: మంత్రి పెమ్మసాని

HYD Why did the police arrest Divvela Madhuri?

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మద్యం పార్టీ

దివ్వెల మాధురి బర్త్‌డే సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఈ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో గల ‘ది పెండెంట్’ అనే ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. దీనికి పలువురు నాయకులు హాజరు కాగా, ఈ ఫంక్షన్‌లో జోరుగా మద్యం పార్టీ సాగింది. నిబంధనల ప్రకారం ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నిర్వాహకులు గానీ, ఫామ్‌హౌస్ యాజమాన్యం గానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

డీజే సౌండ్స్, నిబంధనల ఉల్లంఘన: కేసు నమోదు

సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు మరియు ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించి పార్టీని భగ్నం చేశారు. నిర్వాహకుల నుంచి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనుమతి లేకుండా మద్యం సేవించడం, లిక్కర్ బాటిళ్లను నిల్వ ఉంచడం, బర్త్‌డే పార్టీలో శృతి మించిన స్థాయిలో డీజే సౌండ్స్‌ను వినియోగించడం వంటి కారణాలతో పోలీసులు, ఎస్ఓటీ అధికారులు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దివ్వెల మాధురి కొద్దిరోజుల కిందటే బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bigg Boss contestant. Divvela Madhuri foreign liquor bottles seized Google News in Telugu Latest News in Telugu liquor consumption violation loud DJ sounds Moinabad farmhouse Rajendranagar Police SOT police arrest Telugu News Today The Pendant farmhouse unauthorized liquor party YSRCP MLC Duvvada Srinivas

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.