హైదరాబాద్(Hyderabad Weather)లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. 10ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. నిన్న పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 6.4 డిగ్రీలు తక్కువగా నమోదైంది.
Read Also: Telangana: 25వ తేదీన క్యాబినెట్ భేటీ – పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయాలు
రాజేంద్రనగర్‌లో 11.5°C, హయత్‌నగర్‌లో 12.6°C నమోద కాగా, కూకట్‌పల్లి(Kukkatpally), పాతబస్తీ ప్రాంతాల్లో 13°C వరకు పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టించే చలిని ఎదుర్కొంటున్నారు. నగరంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4°Cగా, కనిష్ఠం 13.1°Cగా నమోదైంది. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు దట్టమైన మంచు కనిపిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: