📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

Telugu News: HYD: తెలంగాణ రైజింగ్ 2047

Author Icon By Sushmitha
Updated: December 11, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ HYD ‘తెలంగాణ రైజింగ్ 2047’ లో (Telangana Rising) భాగంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేందుకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే, రాష్ట్రంలో అధికంగా ఉన్న యువతే కీలకమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నైపుణ్యంతో కూడిన యువత చోదక శక్తిగా మారుతుందని, వారిని బలోపేతం చేయడానికి విద్య, క్రీడలు, ఆవిష్కరణలు, నైపుణ్యాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై విజన్ 2047 డాక్యుమెంట్లో ఒక సమగ్ర కార్యాచరణను పొందుపరిచింది. పరిశ్రమల్లో అవసరమయ్యే విధంగా నైపుణ్యాలతో కూడిన మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దాలని, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

Read Also: Adluri Laxman: గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి

ప్రస్తుతం యువతలో డిజిటల్ స్కిల్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అండ్ మెషీన్ లెర్నింగ్, ఆరోగ్య రంగ కార్యకర్తలు, అలాగే ఎలక్ట్రిషియన్స్, హార్డ్‌వేర్ మెకానిక్స్ వంటి సాంకేతిక ఉద్యోగాలకు జపాన్, యూకే, జర్మనీలతో పాటు ఆసియా పసిఫిక్ తదితర దేశాల్లో ఎక్కువ ఆదరణ ఉంది. ఈ గ్లోబల్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టామ్‌కామ్‌ను బలోపేతం చేయనుంది. దీని కోసం విదేశాలకు వెళ్లదలచుకునే వారికి ఆయా దేశాల భాషల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

HYD Telangana Rising 2047

జర్మన్ ‘ద్వంద్వ అప్రెంటిస్‌షిప్ మోడల్’ అమలు

మన దేశంలో విద్యా వ్యవస్థలో ప్రాక్టికల్స్ కంటే థియరీ విధానమే ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తరగతి గది పాఠాలకే పరిమితమవుతున్నారు. దీన్ని మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకు, జర్మనీ విద్యా వ్యవస్థలో ద్వంద్వ విధానం (డ్యూయల్ అప్రెంటిస్‌షిప్ మోడల్) అమలవుతోంది. ఈ విధానంలో విద్యార్థులు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కళాశాలల్లో పాఠాలు చదువుకుంటారు. మిగిలిన నాలుగు లేదా ఐదు రోజులు పరిశ్రమల్లో శిక్షణ పొందుతారు. అక్కడ పనిచేసినందుకు గానూ వారికి కొంత మొత్తంలో స్టైఫండ్‌ను చెల్లిస్తారు. అలాంటి అప్రెంటిస్‌షిప్ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

3 Trillion Dollar Economy AIML skills Artificial Intelligence Machine Learning foreign language training centers Google News in Telugu Latest News in Telugu skill development Telangana Rising 2047 Telugu News Today TOMCOM strengthening Vision 2047 document Youth empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.