హైదరాబాద్: HYD తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు రూ.5,000 కోట్ల రుణం సమీకరించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నిధులను సేకరించడానికి రాష్ట్ర సర్కార్ ఇండెంట్ పెట్టింది. ఈ నెల 25వ తేదీన రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బహిరంగ వేలంలో ఈ నిధులను సమీకరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అధిక వడ్డీ రుణాలను చెల్లించేందుకు మళ్లీ రుణం చేయాలని నిర్ణయించింది.
Read Also : India China demarche : చైనా విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై అవమానం..
రుణ మార్పిడి లక్ష్యం, మెచ్యూరిటీ కాలం
తక్కువ వడ్డీ రేట్లకు కొత్త అప్పులను సమీకరించడం ద్వారా పాత రుణాల చెల్లింపు లక్ష్యంగా రుణ మార్పిడి లో భాగంగా ఈ రుణాలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 13 నుండి 28 సంవత్సరాల వరకు పొడిగించిన మెచ్యూరిటీ కాలాలతో నాలుగు విడతలుగా నిధులను సేకరించాలని కోరుతూ ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రతిపాదనను సమర్పించింది.
FRBM పరిమితి పెంపు, ఆర్థిక సంక్షోభం అధిగమనం
ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు మిగిలి ఉన్నప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించిన రూ.54,009 కోట్ల రుణ పరిమితిని మించి అదనపు రుణాన్ని సేకరించినట్లవుతోంది. కాగా, రుణాల మంజూరు విషయంలో కేంద్రం నిర్దేశించిన ఫిజికల్ రెస్పాన్సిబులిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ (FRBM) నుండి తెలంగాణ సర్కార్‌కు ఇటీవల పెద్ద రిలీఫ్ లభించింది. FRBM పరిమితిని పెంపుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
2025-26 సంవత్సరానికి ప్రాథమిక అంచనాలకు అదనంగా దాదాపు రూ.15,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందని ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి. దీనితో మొత్తం అనుమతించదగిన రుణాలు దాదాపు రూ.69,000 కోట్లకు చేరుకోనున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం నిబంధనలు సైతం సడలించినట్లు సమాచారం. కేంద్రం అసాధారణ ఆమోదంతో రాష్ట్ర సర్కార్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించినట్లయింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also :