హైదరాబాద్: HYD వ్యవసాయ, (agricultural) అణుశక్తి, బీమా రంగాల్లో సంస్కరణలు సంవత్సరాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఆయా రంగాల్లో ప్రైవేటు సంస్థలు, విదేశీ కంపెనీల పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన చట్టాలను, ప్రస్తుతం ఉన్న వాటికి సవరణలు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. నీతి ఆయోగ్ ప్యానల్ చేసిన ప్రతిపాదనలతో సంస్కరణలకు నడుం కట్టింది. ప్రపంచ కంపెనీలను ఆకర్షించడం, పెట్టుబడుల ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా సంస్కరణల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో చాలా వరకూ వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను రూపొందించనుంది.
Read Also: New Liquor brands : త్వరలో తెలంగాణ లో కొత్త మద్యం బ్రాండ్లు!
వ్యవసాయ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ముఖ్యంగా వ్యవసాయం, తోటల పెంపకంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్డీఐ) ప్రోత్సహించాలని నిర్ణయించింది. పొగాకు మినహా గంధం, కోకో, అరటి, మిరియాలు, కనట్, వెదురు, చెరకు వంటి వాటితో పాటు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
ఆటోమేటిక్ మార్గం: ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం విదేశీ పెట్టుబడులు ప్రస్తుతం టీ, కాఫీ, రబ్బరు, ఏలకులు, ఆలివ్ ఆయిల్, పామాయిల్ తోటల పెంపకంలో మాత్రమే అనుమతించింది. అలాగే పూల పెంపకం, ఉద్యానవనం, నియంత్రణ పరిస్థితుల్లో ఉన్న కూరగాయలు, పుట్టగొడుగుల పెంపకం, పశు సంవర్ధకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపక రంగాలకు సైతం అందుబాటులో ఉండనుంది.
బీమా రంగంలో ఎఫ్డీఐ పెంపు
మరో కీలకమైన బీమాకు సంబంధించి 2020 విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించడం, భారత్‌లో తమ మొత్తం ప్రీమియంను పెట్టుబడి పెట్టే బీమా కంపెనీలకు ఎఫ్డీఐ పరిమితిని 74 నుండి 100 శాతం పెంచాలని భావిస్తోంది. దీని కోసం బీమా చట్టాల సవరణ బిల్లు- 2025 తీసుకురానుంది. ఈ బీమా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే పరిస్థితులకు మాత్రమే పరిమితం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ నిబంధనలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రతిపాదనగా కేంద్ర వర్గాలు వెల్లడించాయి. విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుండి 74 శాతానికి పెంచడానికి అవకాశం కల్పించనుంది.
అణుశక్తి రంగంలో సంస్కరణలు
ఇక అణుశక్తి విషయంలో ఈ రంగం వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని కేంద్రంలో విస్తృత అభిప్రాయం ఉంది. కేంద్రం ఇప్పటికే అణుశక్తి బిల్లు 2025ను పార్లమెంట్ సమావేశానికి జాబితా చేసింది. ఇది ప్రధాన విధాన మార్పులతో పాటు, ఎఫ్డీఐ పాలనను అనుమతించే అవకాశం ఉంది.
ఏ రంగాల్లో సంస్కరణలు సంవత్సరాంతానికి వచ్చే అవకాశం ఉంది?
వ్యవసాయ, అణుశక్తి, బీమా రంగాల్లో.
వ్యవసాయ రంగంలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు చట్టాలను సవరిస్తున్నారు?
100 శాతం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: