మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant – NBW) జారీ అయింది. (HYD) తనపై మంత్రి సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెపై పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
Read Also: Nizamabad Results: తెలంగాణ పంచాయతీ జోరులో జాగృతి..95 ఏళ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్
తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా
కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో, నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసి, తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
వారెంట్‌పై మంత్రి సురేఖ స్పందన
నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తనకు ఎలాంటి నాన్ బెయిలబుల్ వారెంట్ అందలేదని ఆమె అన్నారు. తదుపరి విచారణకు హాజరు కావాలని మాత్రమే కోర్టు చెప్పిందని ఆమె వివరించారు. ఫిబ్రవరి 5న కోర్టుకు హాజరు కావాలని కోర్టు చెప్పిందని ఆమె తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: