📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest News: Hyderabad Metro: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు

Author Icon By Anusha
Updated: November 1, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరంలో రోజువారీగా వేలాది మంది ప్రయాణికులు ఆధారపడే మెట్రో (Hyderabad Metro) రైళ్ల టైమింగ్స్‌లో కీలక మార్పులు జరిగాయి. హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇకపై మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ నవంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు.

Read Also: Indiramma illu update : ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు

అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని.. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని పేర్కొంది. వారంలోని అన్ని రోజులూ ఇదే రకమైన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది.దీనికి సంబంధించి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ (L&T Hyderabad Metro Rail) ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.

ఈ నిర్ణయం కారణంగా హైదరాబాద్‌ మెట్రో రైళ్ల (Hyderabad Metro) లో రాత్రి 11 దాటిన తర్వాత ప్రయాణాలు చేసే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆ సమయంలో బస్సులు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మెట్రో రైళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

Hyderabad Metro

రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య

అయితే రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్లు రాత్రి 11.45 గంటలకు బయలుదేరేవి.

అక్కడి నుంచి చివరి స్టేషన్‌కు చేరుకునేందుకు దాదాపు 45 నుంచి 50 నిమిషాల వరకు సమయం పట్టేది. దీంతో అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు కూడా వీలు ఉండేది.అయితే మొదట్లో ఇవే రకమైన టైమింగ్స్ ఉండేవి.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి వేళ చివరి రైళ్లను

కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి వేళ చివరి రైళ్లను.. ప్రారంభ స్టేషన్ నుంచి 11 గంటలకు బదులు.. 11.45 గంటలకు బయలుదేరేవి. ఇవి కేవలం వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండేవి.

ఇక అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం రోజున తొలి మెట్రో రైలు ఉదయం 6 గంటలకు బదులు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో సోమవారం రోజున ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభం అయ్యేవి. అయితే ఇవన్నీ వర్కౌట్ కాకపోవడం వల్ల మళ్లీ పాత పద్దతిలోనే రైళ్లను నడపనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News hyderabad metro new schedule hyderabad metro timings change latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.