HYD తెలంగాణ (Telangana) ఇరిగేషన్ శాఖ మరియు ఎన్డీఎస్ఏ (NDSA) నిపుణుల కమిటీ, ఈఎన్‌సీ (ENC) జనరల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో కీలక నిర్ణయానికి వచ్చాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలని, అలాగే భవిష్యత్తులో కుంగిపోయే అవకాశం ఉన్న ఇతర బ్లాక్‌లను కూడా తొలగించి పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
Read Also: CM Bhatti: సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం
కాళేశ్వరం బ్యారేజీల (Kaleshwaram Barrages) (మేడిగడ్డ, (Medigadda Barrage) అన్నారం, సుందిళ్ల) రిపేర్లకు సంబంధించిన డిజైన్‌లపై టెండర్లు వేసిన సంస్థలతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌లను ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ ‘ప్రయోజన వ్యక్తీకరణ’ ద్వారా మరమ్మతులు చేయడానికి టెండర్లు పిలిచింది. ఐదు సంస్థలు బిడ్లు వేయగా, అందులో నుంచి మూడు సంస్థలకు (ఆర్వీ అసోసియేట్స్-ఐఐటీ మద్రాస్ జేవీ, స్పెయిన్‌కు చెందిన ఐప్రీసస్ జేవీ, మరియు డీఎంఆర్-ఆర్టీఎం ఇంట్రప్లాన్ సిగ్మా జేవీ) ప్రైస్ బిడ్లను ఆహ్వానించింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ డిజైన్ చేసిన ఆఫ్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా బిడ్ వేసింది.
టెస్టుల రిజల్ట్స్‌కు అనుగుణంగా డిజైన్లు: అధికారుల స్పష్టీకరణ
బ్యారేజీల రిపేర్లకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సంస్థలు లేవనెత్తిన సందేహాలకు అధికారులు క్లారిటీ ఇచ్చారు. డిజైన్లతో పాటు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలా అని సంస్థలు ప్రశ్నించాయి. అయితే, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) ద్వారా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారని, ఆ టెస్టుల రిజల్ట్స్ మరియు డిజైన్లకు అనుగుణంగానే పునరుద్ధరణ డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు సంస్థలకు స్పష్టం చేశారు. ఈవోఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే డిజైన్లు ఇవ్వాలని కూడా తెలిపారు.
ఐఐటీతో కలిసి జాయింట్ వెంచర్ (Joint Venture – JV) గా ఏర్పడే సంస్థకు మరమ్మతు బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా, జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (NDSA) సూచనలకు అనుగుణంగా సాంకేతిక మరియు ఫైనాన్సియల్ బిడ్స్‌ను దాఖలు చేసిన ఆర్వీ అసోసియేట్స్-ఐఐటీ మద్రాస్ జేవీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
సాంకేతిక అర్హతకే ప్రాధాన్యం
టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటేనే, ప్రైస్ బిడ్‌లతో కూడిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ బిడ్‌లను ఈ నెల 12న తెరవనున్నారు. అయితే, కేవలం ప్రైస్ బిడ్‌లు తక్కువ రేటుకు కోట్ చేసిన సంస్థలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా, అన్ని సాంకేతిక అర్హతలు ఉన్న సంస్థకే రీహాబిలిటేషన్ డిజైన్ల బాధ్యతలను అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: