హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్(Paradise Metro Station) వద్ద ఈరోజు ఉదయం కలకలం రేగింది. మెట్రో స్టేషన్‌లోపలికి వెళ్లిన ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు మెట్రో స్టేషన్ పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది.
Read Also: SCSS: సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీస్ స్కీమ్ భారీ ఆదాయం
గాంధీ ఆసుపత్రికి తరలింపు, పోలీసుల దర్యాప్తు
ప్రమాదం జరిగిన వెంటనే మెట్రో సిబ్బంది అప్రమత్తమై వేగంగా స్పందించారు. కిందకు దూకి గాయాలపాలైన ఆ వ్యక్తిని వెంటనే అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి(Gandhi Hospital) తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స అందుతోంది. మెట్రో సిబ్బంది ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మానసిక స్థితి సరిగా లేదనే అనుమానం
ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: