📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

Author Icon By Saritha
Updated: February 4, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని వెల్లడి

హైదరాబాద్ : (HYD) చర్లపల్లి రైల్వే స్టేషన్ (Cherlapally Railway Station) వద్ద ఘట్కేసర్ మార్గంలో గత నెల 30వ తేదీన అర్థరాత్రి 12,40 గంటల సమయం లో బోడుప్పలు చెందిన విజయశాంతి రెడ్డి (38) ఆమె కుమార్తె చేతనా రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (16)లు గూడ్సు రైలు కిందపడి ఆత్మ హత్య చేసుకోవడంపై విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మంగళవారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న ఆయన రెండు రోజుల క్రితం భారత్కు వచ్చారు. తన భార్య, పిల్లల అంత్యక్రియలను ఆదివారం నాడు నిర్వహించాక మంగళవారం నాడు రైల్వే పోలీసుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇస్తూ తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ఆయన తెలిపారు.

Read Also: Mirchi : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

Husband’s statement regarding the suicides at Cherlapally railway station.

భార్య, పిల్లల మరణంపై భర్త ఆవేదన

తన భార్య విజయశాంతి రెడ్డి చాలా ధైర్య వంతురాలని, ఇద్దరు పిల్లలంటే ఆమెకు ప్రాణమని ఆయన తెలిపారు. తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేదని, కుటుంబంలో కూడా ఎలాంటి కష్టాలు లేవని ఆయన తెలిపారు. తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని సురేందర్ రెడ్డి ఆవేదనగా తెలిపారు. దీనిపై పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. మరోవైపు (HYD) చర్లపల్లి స్టేషన్ సమీపంలో తల్లీ ఇద్దరు టీనేజి పిల్లల ఆత్మహత్యలపై రైల్వే పోలీసుల విచారణ కొనసాగుతోంది.

తాను ఒంటిరిదానిని అయ్యానని విజయశాంతి రెడ్డి రాసిన సూసైడ్ లెటరన్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ విషయం ఆమె ఎందుకు రాసిందని, ఇంట్లో అన్ని వుండి కూడా ఎందుకు ఒంటరిగా మారిందనే బావన ఆమెకు కలిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమైనా వేధింవులు వున్నాయా…? సహచరుల నుంచి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా….? ఇంట్లో ఏమైనా ఇక్కట్లు వున్నాయా…? లేదా పిల్లలకు ఏమై నా సమస్యలు వచ్చాయా…? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

ఆత్మహత్యల వెనుక కారణాలపై బహుముఖ దర్యాప్తు

ఇక వీరి ఆత్మహత్యలను నివారించడంలో చర్లపల్లి స్టేషన్లో వున్న భద్రతా సిబ్బంది తీరు గురించి విమర్శలు రావడంతో దీనిపైనా రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్కు వచ్చినట్లు సిసి కెమెరాల్లో వుంది. దీని తరువాత కారు తాళాలను కుమారుడు విశాల్ రెడ్డి జేబులో వుంచింది. అనంతరం ఇద్దరు పిల్లలతో స్టేషన్లో అటు ఇటూ అరగంట పాటు తిరిగింది.

అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఇద్దరు పిల్లలతో రైళ్ల రాకపోకలు లేని సమయంలో స్టేషన్లో ఎందుకు తచ్చాడుతుందనే దానిపై భద్రత సిబ్బంది ఎందుకు గమనించలేదనే అంశంపైనా రైల్వే పోలీసులు విచారి స్తున్నారు. దీని తరువాత ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి చీకట్లో ఘట్కేసర్ మార్గంలో రైలు పట్టాలపై వెళుతున్నపుడు కూడా ఎవరూ గమనించకపోవడం కూడా భద్రతా సిబ్బంది వైఫల్యంగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. విజయశాంతి రెడ్డి సెల్ఫోన్ తో పాటు ఇతర వస్తువులను జప్తు చేసిన పోలీసులు దీనిని ఎఫ్ఎస్ఎల్కు పంపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

charlapalli railway station Family suicide case Husband Statement Latest News in Telugu Mother and Children Suicide Railway Police Investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.