📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: HYD: కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరం

Author Icon By Sushmitha
Updated: December 1, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: HYD కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కమ్యూనిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో “కమ్యూనిస్టులను ఐక్యం చేయడానికి మనం ఏమి చేద్దాం” అనే అంశంపై కోలా జనార్దన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

Read Also: B. Sudarshan Reddy: లౌకికవాదం, సామాజిక న్యాయాలను కాపాడుకోవాలి

HYD Communist unity is a historical necessity

సమావేశంలో ప్రముఖుల ప్రసంగాలు

ఈ సమావేశానికి విశ్రాంత హైకోర్టు (High Court) న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించగా, సభలో సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, ప్రముఖ సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అతిథిలుగా పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ జేఏసీ కోఆర్డినేటర్ నాగమోని చిన్న రాములు ప్రసంగించారు.

బీజేపీ ప్రభుత్వంపై కమ్యూనిస్టుల విమర్శలు

దేశంలోని పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, బహుళజాతి సంస్థలు, దేశ సహజ సంపద (భూమి, అడవులు, ఖనిజ సంపద)ను దోచుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళారిగా వ్యవహరిస్తూ ఆదివాసీలను, రైతులను, కార్మికులను అణిచివేసేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం దారుణమని విమర్శించింది. అంతేకాకుండా నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేస్తూ అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తూ అణచివేత కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

కమ్యూనిస్టు ఐక్యతకు పిలుపు

ఈ క్లిష్ట సమయంలో ప్రజల మౌలిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కుల రక్షణ, జీవించే హక్కులను కాపాడుకోవడానికి కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సిన చారిత్రక అవసరం అని సూచించింది. ఇరు పార్టీ విభేదాలు, విధానపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి కనీస అంగీకృత అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని కమ్యూనిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంసీపీఐ నాయకులు గాదగోని రవి, ఎస్‌యూసీఐ నాయకులు మురహరి, తెలంగాణ ఉద్యమ నాయకులు జి. రాంచందర్ రావు, నారాయణ రావు, పొన్నం దేవరాజ్ గౌడ్, సతీష్ రెడ్డి, శ్రీరాముల శ్రీనివాసులు, ఇంద్రవెల్లి రమేష్, సంజీవ్ కుమార్, కె. దేవేరి, బాలచందర్, పెండ్యాల మధుసూధనా చారి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BJP Criticism Communist unity corporate exploitation fundamental rights. Google News in Telugu JAC roundtable Justice Chandrakumar labor codes Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.