హైదరాబాద్: HYD దేశవ్యాప్తంగా అనేక మందిని బలిగొన్న బెట్టింగ్ (Betting) యాప్‌ల అక్రమాలపై రాష్ట్ర నేర పరిశోధనా విభాగం సీఐడీ (CID) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రానా, యాంకర్ విష్ణుప్రియలను విచారించిన సీఐడీ సిట్ బృందం, శుక్రవారం నాడు ఇద్దరు హీరోయిన్‌లతో పాటు మరో మహిళా యాంకర్‌ను విచారించింది.
Read also : CJI Gavai : బుల్డోజర్ జస్టిస్’పై తీర్పే నా అత్యంత ముఖ్యమైనది..
నాలుగు గంటలకు పైగా విచారణ
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హీరోయిన్లు నిధి అగర్వాల్,(Nidhi Agarwal) అమృతా చౌదరి, యాంకర్ శ్రీముఖిలను సీఐడీ ఆర్థిక నేరాల విభాగం నాలుగు గంటలకు పైగా విచారించింది. రాష్ట్రంలోని పంజాగుట్టతో పాటు మియాపూర్ పోలీసు స్టేషన్లలో సినీ తారలు, టీవీ నటులు, యాంకర్లపై బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులలో యాప్ యజమానులతో సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి.
ప్రమోషన్ ఒప్పందాలపై ప్రశ్నలు
విచారణలో భాగంగా, ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఆర్థిక ఒప్పందాల గురించి సిట్ అధికారులు ముగ్గురిని ప్రశ్నించారు.
- నిధి అగర్వాల్: ‘జీత్ విన్’ అనే బెట్టింగ్ సైట్‌ను ప్రమోట్ చేశారు.
- యాంకర్ శ్రీముఖి: ‘ఎం88’ అనే యాప్‌ను ప్రమోట్ చేశారు.
- అమృతా చౌదరి: ‘యోలో 247’, ‘ఫెయిర్ ప్లే’ అనే యాప్‌లను ప్రమోట్ చేశారు.
యాప్‌లకు ప్రమోషన్ చేసినందుకు ఆయా సంస్థలు ఎంత మొత్తం చెల్లించాయి, ఈ చెల్లింపులు ఎలా జరిగాయి? అనే అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :