నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీపీ సజ్జనార్ (sajjanar) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ ప్రవాహానికి ఆటంకంగా మారుతున్న బస్‌స్టాప్‌లను తొలగించి, రోడ్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ఈ చర్యలతో ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ తగ్గి, ప్రజలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
Read also: IBOMMA: ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?
CP Sajjanar
వర్షాకాలంలో వాన నీరు నిల్వ కాకుండా
హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వర్షాకాలంలో వాన నీరు నిల్వ సమస్య, ప్రజా భద్రత అంశాలపై టీజీ–ఐసీసీసీ ఆడిటోరియంలో సీపీ సజ్జనార్ అధ్యక్షతన కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్లు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
వర్షాకాలంలో వాన నీరు నిల్వ కాకుండా మలక్‌పేటలో విజయవంతంగా అమలు చేసిన రోబోటిక్ క్లీనింగ్ విధానాన్ని నగరమంతటా విస్తరించాలని సీపీ సూచించారు. అలాగే రోడ్డు మధ్యలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లను తొలగించడం, అవసరమైన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యాల విస్తరణపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఆటోలు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేయకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయిస్తామని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: