📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు

Telugu News: HYD: సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (బేగంపేట): HYD సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ కాలువ కిరణ్ మరియు చైన్‌మెన్ భాస్కర్లను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఒక స్థలంపై డిమార్కేషన్ (సరిహద్దు విభజన) చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు.

Read also : DigitalPiracy: IBOMMA రవి కి 3 నుంచి 7ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం?

HYD ACB searches at Secunderabad Tahsildar’s office

లంచం డిమాండ్, వలపన్ని పట్టివేత

సికింద్రాబాద్ (Secunderabad) మండల పరిధిలోని మినిస్టర్ రోడ్‌లో ఉన్న ఒక స్థలం పార్కు స్థలమో కాదో సర్వే చేసి చెప్పాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు మండల సర్వేయర్ కిరణ్‌కు సూచించారు. ఈ స్థలాన్ని ఫిర్యాదుదారుడు హోటల్‌కు లీజుకు ఇచ్చారు. దీంతో సర్వేయర్ కిరణ్ ఫిర్యాదుదారుడి వద్దకు వెళ్లి సర్వే చేయకుండా ఉండాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బేరం కుదరక చివరకు రూ. 2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఫిర్యాదుదారుడు లక్ష రూపాయలు తీసుకుని వచ్చానని చెప్పగా, కారులో ఉండండి నేను వేరొకరిని పంపిస్తానని కిరణ్ వారికి చెప్పాడు. ఆ డబ్బు తీసుకున్న చైన్‌మెన్ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ అప్పటికే నిజామాబాద్ వెళ్లేందుకు బోయిన్‌పల్లి బస్టాప్ వరకు వెళ్లిపోగా, వెంబడించిన మరో బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది.

విచారణ, అదనపు సోదాలు

చైన్‌మెన్ భాస్కర్, సర్వేయర్ కిరణ్ సూచన మేరకే తాను డబ్బు తీసుకున్నానని ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అలాగే నిజామాబాద్‌లోని కిరణ్ నివాసంలో కూడా మరో బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిందితులు ఇద్దరూ అయ్యప్ప మాల ధారణలో ఉండి కూడా లంచం తీసుకోవడం గమనార్హం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

ACB trap Bribery Case Google News in Telugu Hyderabad crime. Latest News in Telugu Secunderabad MRO office surveyor arrest Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.