📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Human Trafficking: మానవ అక్రమ రవాణా నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి : మంత్రి సీతక్క

Author Icon By Shravan
Updated: July 31, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను (Human trafficking) నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, పంచాయితీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ భవనంలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజల ఫౌండేషన్ చైర్మన్ సునీత కృష్ణన్కు అభినందనలు తెలిపారు. సునీత కృష్ణన్ 32 వేల మంది మహిళలని వ్యభిచార కూపంనుంచి విముక్తి కల్పించార న్నారు. మానవ అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా ఉందని వారి గురించి మాట్లాడాలంటే సామాన్యులు భయపడతారని, అటువంటి సునీత కృష్ణన్ ప్రాణాలకు తెగించి ఆ ముఠాకు వ్యతి రేకంగా పోరాటం చేస్తున్న ఆమె ప్రజలకు స్పూర్తి దాయకమన్నారు.

మహిళల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, మహిళల్లో ఉండే పేదరికం నిర్మూలించేందుకు సెర్చ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మహిళలకు వేల కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మహిళా సంఘం సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, 2 లక్షల లోను అమలు చేస్తు న్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘం అంటే కేవలం ఆర్థిక స్వాలంబనే కాదు అది వారిలో సామాజిక భద్రతను, మానసిక ధైర్యాన్ని కలిగిస్తోందన్నారు. మానవ అక్రమ రవాణాపై సమిష్టి పోరాటం చేయడంతో ద్వారా ఆ భూతాన్ని అంతం చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ సర్వీస్ అథారిటీ నెంబర్ సెక్రెటరీ పంచాక్షరి, అడిషనల్ డీ.జి. మహేష్ భగవత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, తదితరులు పాల్గొన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Local Elections : విలీన గ్రామాలకు స్థానిక ఎన్నికలు లేనట్టే

Breaking News in Telugu Central Government human trafficking Latest News in Telugu minister Sitakka state cooperation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.