📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

METRO RAIL: మెట్రో ప్రయాణికులకు శుభవార్త ​ – తగ్గిన ఛార్జీలు

Author Icon By Sudha
Updated: May 20, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త! ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో టికెట్ ధరలను 10% తగ్గిస్తూ, హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలు (METRO RAIL)యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు మే 24, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై భారం (Burden on passengers)తగ్గించడమే కాకుండా, మెట్రో సేవలను మరింత మంది వినియోగించే అవకాశం ఉంది .

METRO RAIL: మెట్రో ప్రయాణికులకు శుభవార్త ​ – తగ్గిన ఛార్జీలు

తగ్గింపు మే 24 నుంచి అమల్లోకి..
ప్రస్తుతం, మెట్రో టికెట్ ధరలు దూరం ఆధారంగా రూ.10 నుండి రూ.75 వరకు ఉన్నాయి. 10% తగ్గింపు తర్వాత, ఈ ధరలు సుమారు రూ.9 నుండి రూ.68 వరకు ఉంటాయి. ఇది ప్రయాణికులకు సుమారు రూ.1 నుండి రూ.7 వరకు ఆదా చేసే అవకాశం కల్పిస్తుంది. ఈ తగ్గింపు మే 24, 2025 నుంచి అమల్లోకి రానుంది. ప్రయాణికులు ఈ తేదీ నుంచి తగ్గిన ధరలతో మెట్రో సేవలను వినియోగించవచ్చు.
వారం రోజుల క్రితం మెట్రో ఛార్జీలను పెంచుతూ హైదరాబాద్​ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న టికెట్​ ధరకు కనిష్ఠంగా రూ.10 నుంచి రూ.12, గరిష్ఠ టికెట్​ ధర రూ.60 నుంచి రూ.75గా సవరించారు. ఈ ఛార్జీలను కిలోమీటర్ల వారీగా పెంచారు. మెట్రో ఛార్జీలు పెంచిన దగ్గరి నుంచి ప్రయాణికులు, విపక్షాల నుంచి ధరలను తగ్గించాలని డిమాండ్​లు వచ్చాయి. దీంతో పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Read Also : Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: ఎఫ్‌ఐఆర్ నమోదు

Breaking News in Telugu good news Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Passengers reduced fares Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.