గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనా నిర్మాణంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించి, శివారు 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం ద్వారా బృహత్ హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
Read Also: TG Panchayat Elections: సీఎం స్వగ్రామంలో మాజీ మావోయిస్టు ఏకగ్రీవం
ఈ విలీన ప్రక్రియ పూర్తయితే.. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు సుమారు 300 డివిజన్లకు పెరిగే అవకాశం ఉంది. శివారు ప్రాంతాల నుంచి విలీనం కానున్న పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మరో సుమారు వంద డివిజన్లు ఉన్నాయి. ఈ భారీ మార్పుకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు.విలీన ప్రక్రియ పూర్తయ్యాక.. ప్రస్తుతం ఉన్న డివిజన్లన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు శనివారం ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను సమర్పించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు, 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయి.
స్థానిక సంస్థల పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు
వీటిలో కొన్ని డివిజన్లు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉండటం వలన పరిపాలన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, డివిజన్ల హద్దులు తప్పనిసరిగా ఒకే అసెంబ్లీ స్థానం పరిధిలో ఉండేట్టుగా పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు.
ఈ డివిజన్ల పునర్విభజన అనంతరం, పరిపాలనా సౌలభ్యం కోసం సర్కిళ్లు, జోన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా శనివారం రెండు సార్లు సీజీజీని సందర్శించి, అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు, ఇతర పత్రాలను పరిశీలించారు.
శివారు పురపాలికలు, నగరపాలిక కమిషనర్లు కూడా తమ స్థానిక సంస్థల పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. విలీన ప్రక్రియకు సంబంధించిన ఆర్డినెన్స్ పత్రాలు ఇప్పటికే రాజ్‌భవన్‌కు చేరినట్లు సమాచారం, గవర్నర్ సంతకం చేయడమే తరువాయిగా ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also :