తెలంగాణలో వినాయక చవితి (Ganesh immersion) వేడుకలకే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం. 71 ఏళ్ల చరిత్ర గల ఈ బడా గణపతి ప్రతిసారీ తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటాడు. గతంలో 70 అడుగుల ఎత్తు వరకు విరాజిల్లిన ఈ మహాగణపతి, ఇప్పుడు ఒక్కో ఏడాది ఒక అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఎత్తు 69 అడుగులు కాగా, వెడల్పు 28 అడుగులుగా ఉంది. ఈసారి భక్తులకు “శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి” రూపంలో దర్శనమిచ్చారు. నవరాత్రుల తొలినాళ్ల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. శుక్రవారం నుంచి మాత్రం దర్శనానికి అనుమతులు నిలిపివేశారు. కారణం, నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమవ్వడం. శనివారం ఉదయం విగ్రహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ (Hussain Sagar) లో నిమజ్జనం చేయనున్నారు.
నిమజ్జనం ప్రత్యేకతలు
బడా గణపతిని నిమజ్జనం చేయడం చిన్న పని కాదు. ఎందుకంటే ఆయన బరువు సుమారు 40 నుంచి 50 టన్నుల వరకు ఉంటుంది. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ వాహనాలపై తరలించడం అసాధ్యం. అందుకే విజయవాడ (Vijayawada) నుంచి ప్రత్యేక టస్కర్ ట్రక్‌ను రప్పించారు. ఈ టస్కర్ పొడవు 75 అడుగులు, వెడల్పు 11 అడుగులు, 26 చక్రాలతో రూపొందింది. ఇది 100 టన్నుల వరకు బరువును మోయగలదు. గణపతిని టస్కర్‌పై సురక్షితంగా అమర్చేందుకు 20 మంది సిబ్బంది వెల్డింగ్ పనులు చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి మండపం చుట్టూ ఉన్న షెడ్ తొలగించి, కలశ పూజ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 1 గంట ప్రాంతంలో గణపతిని టస్కర్‌పై ఎక్కిస్తారు. మూడుగంటల పాటు వెల్డింగ్ పనులు పూర్తి చేసి, శనివారం ఉదయం విగ్రహాన్ని శోభాయాత్రకు సిద్ధం చేస్తారు.
క్రేన్ ప్రత్యేకత
క్రేన్ ప్రత్యేకత హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం ప్రత్యేక క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఇది హైడ్రాలిక్ టెలిస్కోపిక్ బూమ్ క్రేన్. దీని సామర్థ్యం 100 టన్నులు. అంటే బడా గణపతిని సులభంగా ఎత్తి నీటిలో నిమజ్జనం చేయగలదు. దీని ఎత్తు కూడా 60–70 అడుగుల వరకు ఉంటుంది.
శోభాయాత్ర మార్గం
శోభాయాత్ర మార్గం ఖైరతాబాద్ నుంచి నిమజ్జన స్థలానికి సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియేట్, ఎన్‌టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర Ganesh immersion) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. గణపతితో పాటు ప్రతిష్టించిన ఇతర దేవి విగ్రహాలను తరలించడానికి మరో ప్రత్యేక ట్రక్‌ను వినియోగిస్తారు. మొత్తం మీద ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ బడా గణపతి తన విశిష్టతతో, మహత్తర రూపంతో భక్తుల హృదయాలను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన నిమజ్జన శోభాయాత్ర కోసం నగరవాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈసారి గణపతి ఏ రూపంలో దర్శనమిచ్చారు?
ఈసారి భక్తులకు “శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి” రూపంలో దర్శనమిచ్చారు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎందుకు ప్రత్యేకం?
విగ్రహం యొక్క అత్యంత భారీ ఎత్తు, ప్రత్యేక రూపాలు, భారీ శోభాయాత్ర కారణంగా ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాక దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: