📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Future City : ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు – కెటిఆర్

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి (Future City) భవిష్యత్తు
లేదని, కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్ష నెరవేరదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆయన ఆరోపించారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు.

ఇది నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ, తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా, రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పీఆర్ కోసం ఖర్చు చేసి, ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోందని, చివరికి అధికారులు కూడా దీనిని అంగీకరిస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో

హైదరాబాద్ ఫార్మసిటీ కోసం 20,000 ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసింది. స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములను హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. అయితే కొంతమంది తమ భూములు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. కట ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మోలిక వసతుల కల్పనను ప్రారంభించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని పక్కనపెట్టి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను ఆక్రమంగా రియల్ ఎస్టేట్ కు మళ్లిందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, దీని వల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/india-is-exporting-agricultural-products-abroad/international/531962/

Breaking News in Telugu KTR Future City Statement KTR Latest Comments KTR on Imaginary Projects KTR Speech Updates Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.