హైదరాబాద్ (Hyderabad) నగరంలో విదేశీయుల మోసాలకు ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పూర్వంలో గల్ఫ్ షేక్‌లు చేసిన మోసాల తరహాలోనే, ఇప్పుడు కొంతమంది నైజీరియన్‌లు ‘కాంట్రాక్ట్ మ్యారేజ్’ (‘Contract marriage’) అనే కొత్త కుట్రను అమలు చేస్తున్నారు.వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచిపెట్టాల్సి ఉన్న నైజీరియన్లు, చట్టబద్ధంగా ఉండేందుకు స్థానిక యువతులతో ఒప్పంద పెళ్లిళ్లకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు తలదోసిన కంటై మారింది.విద్య, వ్యాపారం పేరిట భారతదేశానికి వచ్చిన వీరిలో కొంతమంది, డ్రగ్స్ స్మగ్లింగ్, సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గడువు ముగిసినా వెళ్ళకుండా, న్యాయ వ్యవస్థను ఆసరాగా మార్చుకుని కాలయాపన చేస్తున్నారు.ఇటు పోలీసులతో గొడవ పడటం, అర్థం లేని డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం వంటివి కావాలని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో న్యాయపోరాటం పేరిట దేశంలోనే ఉండేందుకు బలమైన అడ్డుకట్ట వేస్తున్నారు.
పేద కుటుంబాలు లక్ష్యం – డబ్బుతో దళారుల ఎత్తుగడలు
నైజీరియన్ల వద్ద ఉన్న అక్రమ డబ్బును ఉపయోగించి, దళారుల సహాయంతో పేద కుటుంబాలను మోసం చేస్తున్నారు. పెద్దలతో చర్చించి యువతులను కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పిస్తున్నారు.పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత, ఆ మహిళలను వదిలేసి పరారవుతున్నారు. ఇలా జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితిలో ఆ యువతులు చిక్కుకుంటున్నారు.
పోలీసుల దృష్టి – ముఠాల గుర్తింపు దిశగా దర్యాప్తు
ఈ దందాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. నైజీరియన్ల కాంట్రాక్ట్ పెళ్లిళ్ల వెనుక ఉన్న ముఠాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్ వరకు వారి కదలికలపై నిఘా పెంచారు.
Read Also : Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు