fish in beer bottle: హైదరాబాద్ మహా నగరంలో ఒక నమ్మశక్యం కాని ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా బీర్ బాటిళ్లలో నాణ్యత లోపాలు లేదా మలినాలు రావడం చూస్తుంటాం, కానీ ఏకంగా ఒక బతికున్న చేప పిల్ల బీర్ బాటిల్‌లో ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ వింత వెలుగుచూసింది.
Read Also: B Pharmacy Fee Hike: తెలంగాణలో బీఫార్మసీ ఫీజుల పెంపు
వివరాల ప్రకారం, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఒక వ్యక్తి స్థానిక వైన్ షాపులో బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో చల్లని బీర్ తాగాలని అనుకుని బాటిల్ తెరిచాడు. అయితే బాటిల్ ఓపెన్ చేసిన వెంటనే అతను చూసిన దృశ్యం అతన్ని షాక్‌కు గురిచేసింది.బీర్ బాటిల్ లోపల చిన్న చేప పిల్ల తిరుగుతూ కనిపించింది.
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సదరు మందుబుబు.. వెంటనే వైన్ షాప్ నిర్వాహకుడిని ప్రశ్నించాడు. అయితే సదరు మందుబాబుతో వైన్ షాపు నిర్వాహకులు దురుసుగా మాట్లాడాడు. బీర్లు తాము తయారుచేయమని.. ఏదైనా సమస్య ఉంటే బీర్లు తయారుచేసిన కంపెనీని అడుక్కోవాలంటూ సమాధానమిచ్చాడు.ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బీర్ బాటిల్‌లో చేప ఎలా వచ్చింది అన్నదానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తయారీ సమయంలో లేదా నిల్వ సమయంలో ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: