📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Fire accident: రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

Author Icon By Tejaswini Y
Updated: December 11, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Fire accident: Major fire in Rahmatnagar SPR Hills

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

హైదరాబాద్‌లోని రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ వద్ద గురువారం భారీ అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అక్కడ నిలిపివున్న మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలు కూడా మంటల బారిన పడటంతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Read also: Hyderabad: హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు

అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కూడా రక్షణ చర్యలు చేపట్టి ప్రజలను ఆ ప్రాంతం నుంచి దూరంగా తరలించారు.

గంజాయి మత్తులో నిప్పంటించాడా?

ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, గంజాయి సేవించి మత్తులో ఉన్న వ్యక్తి చెత్తకు నిప్పు పెట్టిన కారణంగా అగ్ని చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Firefighters response Hyderabad fire incident Rahmatnagar fire accident SPR Hills fire Vehicles burnt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.