📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ameerpet Fire Accident: మైత్రివనం ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్ని ప్రమాదం

Author Icon By Anusha
Updated: February 20, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ameerpet Fire Accident: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట మైత్రివనం చౌరస్తా వద్ద గల ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని నీలగిరి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న రాందేవ్ ఇన్ఫోటెక్, శివం టెక్నాలజీ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Read Also: G. Haragopal: కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ నిలిపి శాంతిని నెలకొల్పాలి

ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌లు ఉంటాయి. దీనితో ఆయా కోచింగ్ సెంటర్‌లలోని విద్యార్థులు కిందకు వచ్చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు,

Ameerpet Fire Accident: Fire accident in Maitrivanam Aditya Enclave

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం

అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది హుటాహుటిన మైత్రివనంకు తరలి వచ్చారు. విద్యార్థులను పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల ద్వారా కూడా సురక్షితంగా తీసుకువచ్చారు.గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదటి అంతస్తు వరకు మంటలు రావడం, పొగలు రెండో అంతస్తు వరకు వ్యాపించడంతో భవనాన్ని ఖాళీ చేయించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aditya Enclave Nilgiri Block Fire Ameerpet Fire Accident latest news Mythrivanam Fire News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.