📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Election: నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్

Author Icon By Sushmitha
Updated: October 13, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నేడు (సోమవారం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం వెంటనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం తెలిపారు. ఫారం 2బీ (నామినేషన్), ఫారం 26 (అఫిడవిట్ – అన్ని కాలమ్స్ తప్పనిసరి, నోటరైజ్ చేయాలి)లతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన తెలిపారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, పబ్లిక్ హాలిడేలు, రెండో, నాలుగో శనివారాలు మినహాయించి నామినేషన్లు దాఖలు చేయవచ్చని చెప్పారు.

Read Also:Sanatana Dharma: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి

నామినేషన్ నిబంధనలు, ప్రతిపాదకులు

అభ్యర్థి కనీస వయసు 25 ఏళ్లు ఉండాలని, ప్రతిపాదకులు తప్పనిసరిగా ఉండాలని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు నియోజకవర్గ ఓటరుగా ఉన్న ఒక్కరు ప్రతిపాదకుడిగా ఉండాలి. అయితే, స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు నియోజకవర్గంలోని ఓటర్లుగా ఉన్న పది మంది ప్రతిపాదకులు అవసరం. ఇతర నియోజకవర్గ అభ్యర్థులు సంబంధిత ఈఆర్ నుంచి ఓటర్ల వివరాలు సమర్పించాలని ఆయన సూచించారు.

డిజిటల్ నామినేషన్, పరిమితులు

ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలిపారు. ఇందుకోసం ఎన్కోర్ వెబ్‌సైట్ ద్వారా నామినేషన్(Nomination) ఫారం ఆన్‌లైన్‌లో సమర్పించి, క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్‌కాపీని తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్ డిపాజిట్ బ్యాంక్/ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండాలని లేదా మాన్యువల్‌గా డిపాజిట్ చేయాలని అన్నారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అయిదుగురు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి జరుగుతుంది?

గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Election Commission Google News in Telugu Jubilee Hills by-election Jubilee Hills returning officer. Latest News in Telugu nomination process Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.