हिन्दी | Epaper
ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

News Telugu: Education: ప్రజాప్రభుత్వంలో విద్యారంగం ప్రతిష్టాత్మకం: భట్టివిక్రమార్క

Rajitha
News Telugu: Education: ప్రజాప్రభుత్వంలో విద్యారంగం ప్రతిష్టాత్మకం: భట్టివిక్రమార్క

Education: డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క: హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్టాత్మంగా తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బెస్ట్ అవైలబుల్ స్కీం ప్రగతిని సమీక్షించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద నిధులకు సంబంధించిన ఒప్పందం పాఠశాల యాజమాన్యాలు, జిల్లా యంత్రాంగం మధ్యన జరిగింది. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే పాఠశాల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి తప్ప విద్యార్థులను బయటికి పంపడానికి వీలులేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు. డీఈవోలు, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

HAM: హ్యామ్డ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం సమ్మతి

Education

విద్యా హక్కు చట్టం. బెస్ట్ అవైలబుల్ స్కీం ఏం చెబుతుంది పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరిగిన ఒప్పందంలో ఏ ఏ అంశాలు ఉన్నాయో పాఠశాలల యాజమాన్యాలను పిలిచి వివరించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పాఠశాలల వారీగా ఉన్న బకాయిల వివరాలను వెంటనే పంపాలని కలెక్టర్లకు సూచించారు. బకాయిల్లో కొంత మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యా, వైద్య రంగాలపై జిల్లా కలెక్టర్లు సీరియస్గా దృష్టి సారించాలని పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆర్థిక శాఖ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు రాకపోతే కొన్నిచోట్ల పాఠశాలలు మూత వేశారని సమాచారం ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు ఎప్పటికప్పుడు రాకపోతే కొన్ని పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఉందని అధికారులు నివేదిస్తున్నారు.

కేవలం బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులపై ఆధారపడితే అది ప్రముఖ పాఠశాల ఏ విధంగా అవుతుందని జిల్లా కలెక్టర్లను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. డీఈవో లు వెంటనే అన్ని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను సందర్శించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది? ప్రభుత్వ నిబంధనలు సరిగా పాటిస్తున్నారా? లేదా? ఆయా పాఠశాలల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వెంటనే నివేదిక సమర్పించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. గడిచిన ఏడు సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల వివరాలు సేకరించాలని డిప్యూటీ సీఎం సూచించారు. Education ప్రస్తుతం ఆ విద్యార్థులంతా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఉన్నత విద్యకు వెళ్లారా?లేదా? తదితర వివరాలు సేకరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు స్వయంగా పర్యవేక్షించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను కోరారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్, సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏ అంశంపై దృష్టి సారించారు?
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగం.

జిల్లా కలెక్టర్లు, డీఈవోలు ఏ పని చేయాలి?
విద్యార్థులు పాఠశాలల్లో ఉండేలా, సమస్యలు ఉంటే పరిష్కరించాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870