📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

News Telugu: EAPCET 2025: ఎప్ సెట్ మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ 10,012 సీట్ల కేటాయింపు

Author Icon By Rajitha
Updated: October 14, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివిన విద్యార్థులు ఎప్ సెట్-2025 EAPCET 2025 ద్వారా.. బి ఫార్మసీ, పార్మా-డి, బైయో టెక్నాలజీ, బయో మెడికల్ (Bio medical) ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించే కౌన్సెలింగ్లో భాగంగా మొదటి విడత సీట్ల కేటాయింపును సోమవారం చేశారు. 10,708 సీట్లకి గానూ 10,012 సీట్లను మొదటి విడతలోనే కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు నేడు (మంగళవారం) ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని లేకపోతే సీటు రద్దవుతుందని సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 71,309 మంది ఎప్ సెట్-2025 లో EAPCET 2025 అర్హత సాధించగా వారిలో 15,775 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరయ్యారు. వారిలో 15,192 మంది 3,90,122 వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 10,012 మందికి సీట్ల కేటాయింపు చేయగా.. మరో 696 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో 93.5 శాతం సీట్లను కేటాయించారు. మొదటి ఫేజ్లో 462 మంది ఈడబ్యూఎస్ కోటా సీట్లను కేటాయించారు.

Read Also: Mahaboobnagar: హాస్టల్ నచ్చలేదని గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

EAPCET 2025

51 కాలేజీల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. వాటిలో 7 యూనివర్సిటీ కాలేజీలుండగా, ఒకటి గవర్నమెంట్ కాలేజీ ఉంది. మరో 43 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లను కేటాయించారు. బి ఫార్మసీలో 122 కాలేజీల్లో 8686 సీట్లు అందుబాటులో ఉంటే.. అందులో 8017 సీట్ల(92.2 శాతం)ను కేటాయించగా మరో 669 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫార్మా డీలో 74 కాలేజీల్లో 1657 సీట్లు ఉంటే వాటిల్లో 1637 సీట్ల(98.7శాతం)ను కేటాయించారు. మరో 20 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. బయో మెడికల్ (Medical) ఇంజనీరింగ్ లో 2 కాలేజీల్లో 48 సీట్లు ఉంటే మొత్తం సీట్లను కేటాయించారు. బయో టెక్నాలజీలో 5 కాలేజీల్లో 202 సీట్లు ఉండగా వాటిలో కూడా 202 సీట్లను కేటాయించారు. మొత్తం 10,708 సీట్లకు గానూ 10,012 సీట్ల(93.5శాతం)ను కేటాయించగా మరో 696 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఎప్‌సెట్‌ (EAPCET) 2025 బైపీసీ మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయి?
మొత్తం 10,708 సీట్లలో 10,012 సీట్లు (93.5%) మొదటి దశలో కేటాయించబడ్డాయి.

సీటు పొందిన విద్యార్థులు ఏం చేయాలి?
విద్యార్థులు మంగళవారం ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BIPC Students Counselling Results EAPCET 2025 latest news Telangana Education Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.