యువతలో మత్తుపదార్థాల వాడకం రోజురోజుకు పెరిగిపోతున్నది. ప్రత్యేకంగా హైదరాబాద్ డ్రగ్స్(Drugs) రహిత నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఆశించినంతగా రావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి,(Cannabis) డ్రగ్స్ వంటివి ఆయావ్యక్తుల చేతులకు అందుతూనే ఉంది. ఈమధ్య ఓ వైద్యుడి ఇంట్లోనే డ్రగ్స్ దొరికిన ఉదంతం మనకు తెలిసిందే. డ్రగ్స్కు బానిసగా మారిన ఆ డాక్టర్ ఇతరులకు డ్రగ్స్ ను సరఫరా చేస్తూ, పోలీసులకు దొరికిపోయారు. ఇలాంటి మోసగాళ్లవల్లే యువత ఎక్కువగా పాడైపోతున్నది. దీనిబారిన పడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు.
Read Also: New App: మరింత సౌకర్యంగా వాట్సాప్ మెసేజ్
గంజాయ్ మత్తులో బస్సు ధ్వంసం
గంజాయి(Drugs) మత్తులో కొంతమంది యువకులు రోడ్లపై హల్ చెల్ చేశారు. హైదరాబాద్-చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద, గంజాయి మత్తులో పటాన్ చెరు నుండి ఏపీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సును కొంతమంది యువకులు ధ్వంసం చేశారు. బస్సు తమ కారుకు తగిలింది అంటూ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. అంతటితో యువకులు ఆగకుండా బస్సు అద్దాలను పగలగొట్టి బస్సును ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: