సికింద్రాబాద్ (Secunderabad) లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Test Tube Baby Center)లో అక్రమాలు బయటపడ్డాయి. శనివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం ఆశగా ఈ సెంటర్‌ను ఆశ్రయించిన ఓ మహిళ, తన భర్త వీర్యకణాలతో గర్భం దాల్చాలని కోరుకుంది. కానీ, వైద్యులు వేరే వ్యక్తి వీర్యకణాలను ఉపయోగించి ఆమెకు గర్భం కలిగించారు.దంపతులకు అనుమానం రావడంతో వారు డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నారు. పరీక్ష ఫలితాల్లో శిశువు డీఎన్ఏ వేరే వ్యక్తిదిగా తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు విస్తృత తనిఖీలు
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. శనివారం ఆ బేబీ సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.తనిఖీల్లో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. సరోగసి కోసం పెద్ద మొత్తంలో వీర్యాన్ని నిల్వ ఉంచినట్లు తేలింది. వీర్య సేకరణలో అక్రమ పద్ధతులు అనుసరిస్తున్నట్లు విచారణలో బయటపడింది.
మరో ఏడుగురి అరెస్ట్
డాక్టర్‌తో పాటు సెంటర్‌లో పనిచేస్తున్న మరో ఏడుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సంఘటన వెలుగులోకి రావడంతో నగరంలో చర్చనీయాంశమైంది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.
Read Also : Chamala Kiran Kumar Reddy : కేటీఆర్ పగటి కలలు కంటున్నారు: చామల కిరణ్