📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

Digital arrest scam : డిజిటల్ అరెస్టు మోసం, హైదరాబాద్ వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Author Icon By Sai Kiran
Updated: January 3, 2026 • 8:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Digital arrest scam : డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. Hyderabad సోమాజిగూడకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.7 కోట్లకుపైగా కాజేశారు. డిజిటల్ అరెస్టులు అనే భావన అసలు లేదని పోలీసులు పదేపదే చెబుతున్నప్పటికీ, మోసగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను వంచిస్తున్నారు.

బాధితుడు గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గతేడాది అక్టోబర్ 27న అతడికి వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబయి నుంచి బ్యాంకాక్‌కు పంపిన కొరియర్‌లో ల్యాప్‌టాప్, పాస్‌పోర్టులు, మాదకద్రవ్యాలు ఉన్నాయని చెప్పి భయపెట్టారు. తాను ఎలాంటి కొరియర్ పంపలేదని చెప్పగానే, ముంబయి పోలీసులమంటూ మరో కాల్ చేసి మాదకద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని బెదిరించారు.

Read also: Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్

ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దంటూ ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని చెప్పి వీడియో కాల్‌లో మాట్లాడించారు. ఆర్థిక లావాదేవీల పరిశీలన పేరుతో తొలుత రూ.19.80 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అనంతరం సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్ చేయించి, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న మొత్తం రూ.7.12 కోట్లను తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పరిశీలన పూర్తయ్యాక డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించారు.

డిసెంబరు 29న మరోసారి ఫోన్ (Digital arrest scam) చేసి కేసు మూసివేత పేరుతో మరో రూ.1.2 కోట్లు డిమాండ్ చేయడంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. ఇటీవల మీడియాలో వచ్చిన డిజిటల్ అరెస్టులపై వార్తలు చూసిన తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే శుక్రవారం 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు Cyber Security Bureau డీఎస్పీ కె.వి.ఎం. ప్రసాద్ తెలిపారు. ప్రజలు ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu cyber crime 1930 helpline cyber fraud elderly Cyber fraud India cyber security bureau Telangana digital arrest fraud news Digital Arrest Scam Google News in Telugu Hyderabad cyber crime Latest News in Telugu online fraud case Signal app scam Telugu News WhatsApp scam India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.