📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

DG Soumya Mishra: జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

Author Icon By Pooja
Updated: January 13, 2026 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వారికి గంజాయి, మద్యం సరఫరా అవాస్తవం, అసాంఘిక కార్యకలాపాలు లేవు

హైదరాబాద్ : రాష్ట్ర జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని డిజి సౌమ్యా మిశ్రా(DG Soumya Mishra) అన్నారు. ఇందులో భాగంగా జైళ్లలో వుండే ఖైదీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తున్నామని ఆమె తెలిపారు. చంచల్ గూడ జైలు ప్రధాన కార్యాలయంలో సోమవారం జైళ్ల శాఖ 2025 యేడాది వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 2024తో పోలిస్తే 2025లో తెలంగాణ జైళ్లలో ఖైదీల సంఖ్య 11.8 శాతం పెరిగిందని తెలిపారు.

Read Also: CM Revanth Reddy: చలాన్ పడగానే డబ్బు కట్

More reforms in the prisons department; free legal advice for prisoners.

ఇందుకు అనేక కారణాలు వున్నాయని ఆమె అన్నారు. జైళ్లలో ఖైదీలు పెరిగినప్పుడు బ్యారక్ లలో సమస్యలు రాకుండా ఖాళీగా వున్న ఇతర జైళ్లలో కొందరు ఖైదీలను బదిలీ వేస్తామని ఆమె వెల్లడించారు. ఇరుకు వ్యారకలలో ఖైదీ లను వుంచేందుకు జైలు మాన్యువల్ అనుమతిం చదని ఆమె(DG Soumya Mishra) అన్నారు. జైళ్లలో ఉండే ఖైదీల్లో రిమాండు ఖైదీలతో పాటు శిక్షపడ్డవారు కూడా ఉంటారని, ఎవరి కేట గిరి మేరకు వారిని ఒక్కోచోట ఉంచడం, చౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అరెస్టయిన వారిని వరిస్థి తుల వేర్వేరు జైళ్లకు మారుస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో 42,566 మంది ఖైదీలు ఉన్నారని, 2024లో ఈ సంఖ్య 38,079గా ఉండేదని సౌమ్యా మిశ్రా తెలిపారు.

ప్రస్తుతమున్న ఖైదీల్లో అండర్ ట్రయల్ ఖైదీలు అత్యధికంగా 36,627 మంది ఉన్నారని, వీరి తరువాత హత్య కేసుల్లో వున్న వారు 3.260 మంది, డ్రగ్స్ కేసుల వారు 7,040, పోక్సో వారు 4,176, సైబర్ నేరాల్లో వున్న వారు 1784 మంది, డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ వారు 2833 మంది. ఆస్తుల గొడవల్లో వున్నవారు 7792 మంది. మహిళలపై నేరాలకు పాల్పడిన వారు 3,478 మంది, శిక్షలు పడ్డ ఖైదీలు 5856 మంది వుండగా మావోయిస్టు ఖైదీలు 40 మంది. 74 మంది విదేశీ ఖైదీలు వున్నారని జైళ్ల శాఖ డిజి తెలిపారు. డ్రగ్స్ కేసులు, పోస్కో కేసులతో పాటు, సైబర్ నేరాలు, డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో నిందితులుగా వుంటూ జైళ్లకు వస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిందని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, పిడి కేసుల్లో నిందితుల సంఖ్య తగ్గిందని ఆమె ఆ న్నారు.

జైళ్లలో సినీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నామని, జైళ్ల నుంచి ఖైదీలు పారిపోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఖైదీలను వారి కుటుంబీకులు కలిసేందుకు ఈ ములాఖత్లను ఏర్పాటు చేయగా ఇది విజయవంతంగా అమలవుతు ందని ఆమె తెలిపారు. జైళ్లలో వుండే బీద ఖైదీలు బెయిల్ పొందేందుకు సహకరించామని, వారికి ఉచిత న్యాయ సలహా అందిస్తున్నామని డిజి సౌ మ్యా మిశ్రా తెలిపారు. ఖైదీలకు నిబంధనల మేరకు పెరోల్ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. శిక్ష పడ్డ ఖైదీలు తమ కుటుంబాలను ఆదుకు నేందుకు రుణ సౌకర్యం కల్పించామని, ఈ రుణాలను ఖైదీలకు లభించే వేతనాల నుంచి మినహాయించుకుంటామని ఆమె వెల్లడించారు.

స్కిల్ దెవ లప్ కింద ఖైదీలకు పలు పథకాల కింద శిక్షణ ఇచ్చామని, వారంతా వృత్తి నైపుణ్యంలో తర్ఫీదు పొందారని ఆమె చెప్పారు. జైళ్లలో ఖైదీలు నిర్వహి స్తున్న పరిశ్రమలు బాగానే పనిచేస్తున్నాయని సౌమ్యా మిశ్రా అన్నారు. నిరక్షరాస్యులైన ఖైదీలో 23,220 మంది ఖైదీలను అక్షరాస్యులను చేశామని ఆమె తెలిపారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఖైదీల పునరావాసం కోసం ఉన్నాయని, ఇవి లాభాపేక్షతో ఏర్పాటైనవి కావని ఆమె వెల్లడించారు. జైళ్లలో గంజాయి, మర్యం సరఫరా జరుగుతుంద వేది అవాస్తవమని, అసాంఘిక కార్యకలాపాలు కూడా నిజం కాదని ఆమె పేర్కొన్నారు. జైళ్ల శాఖలో మౌలిక వసతులను మరింత పెంచడంతోపాటు జైళ్ల స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఖైదీల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బంది పనితీరుడు మరింత మెరుగుపరిచేందుకు అన్నిచోట్ల సిసి కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని వందల గూడలోని జైల్ భవన్లోని కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నామని సౌమ్యామిశ్రా తెలిపారు. ఈ సమావేశంలో జైళ్ల శాఖ విటి రాజేష్, డిబజీలు శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Free Legal Aid Google News in Telugu Jail Reforms Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.