📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Delhi blast: ఢిల్లీ పేలుడుతో ఐసిస్ ఉగ్రవాదులకు లింక్!

Author Icon By Sushmitha
Updated: November 13, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ కారు బాంబు పేలుడు(Delhi blast) ఘటనకు గుజరాత్‌లో అరెస్టయిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులతో(Terrorist) సంబంధం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ కుట్ర, పేలుడుకు హైదరాబాద్‌కు(Hyderabad) చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌తో ఢిల్లీ పేలుడుకు సంబంధం ఉన్న కాశ్మీర్, యూపీకి చెందిన ముగ్గురు వైద్యులకు, ఆత్మాహుతి దళ సభ్యుడిగా భావిస్తున్న మరో వైద్యుడికి సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో రెండు రోజుల వ్యవధిలో రట్టయిన రెండు కుట్రలు, ఒక భారీ పేలుడుకు హైదరాబాద్‌లో లింకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also: Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన

Delhi blast

ఐఎస్ఐ-ఐసిస్ ఉమ్మడి కుట్రపై అనుమానం

ఢిల్లీ కారు బాంబు పేలుడులో ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఐసిస్ ఉగ్రవాదులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్‌లో జరిగిన ఉగ్ర కుట్రల్లో ఐఎస్ఐది ప్రధాన భాగం. కానీ తొలిసారిగా ఈ రెండు సంస్థలు కలిసి ఢిల్లీ పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉగ్రవాద భావజాలం, నిధులు

కశ్మీర్, యూపీలలో పట్టుబడ్డ వైద్యులు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న నిషిద్ధ జైష్ ఏ మహమ్మద్, అన్సార్ ఘజీవత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలకు చెందినవారుగా తేలింది. వీరు యువతలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించి ఉగ్ర సంస్థల్లో చేర్పించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందించడం, ఐఈడీ బాంబుల తయారీపై శిక్షణ ఇవ్వడం వంటివి నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇందుకోసం వైద్యులు ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్లను వాడినట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మాహుతికి పాల్పడింది జైష్-ఏ-మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది, పుల్వామా నివాసి అయిన డాక్టర్ ఉమర్ నబీ అని అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో పాటు, విషపదార్థాలను మార్కెట్లలో వెదజల్లి సామూహికంగా అమాయకులను చంపాలని కూడా వ్యూహాలు రచించినట్లు విచారణలో తేలింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Delhi Car Blast doctor terrorists Google News in Telugu ISI ISIS Latest News in Telugu Suicide Attack Telugu News Today terror conspiracy.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.