అమ్మ వారి పల్లకి సేవ లో ఏ మ్మెల్యే మంజీర ప్రవాహతో తెరుచుకొని ఆలయం మెదక్: తెలంగాణలో(Telangana)నే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఏడుపాయల వన దుర్గా దేవి (Sri Edupayala Vana Durga Bhavani Devalayam) ఆలయంలో సోమవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా మంజీరా ఉదృత ప్రవాహంతో ప్రధాన ఆలయం మూసివేయడం జరిగింది. కానీ రాజగోపురం లో అమ్మ వారి ఉస్తావా విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడు మాదిరిగానే గోకుల్ షెడ్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (MLA Mainampalli Rohith Rao) అమ్మ వారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంజీర నది కి సారె సమర్పించారు.
తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. (Telangana) అందులో భాగంగా సోమవారం మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా వన దుర్గా దేవి భక్తులకు దర్శనమిచ్చారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు ఎక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి?
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో ప్రధాన ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పరిస్థితి ఉంది?
మంజీరా నది ఉగ్ర ప్రవాహంతో ప్రధాన ఆలయం కొన్ని రోజులుగా మూసివేయబడింది. అయితే రాజగోపురంలో అమ్మ వారి ఉస్తావా విగ్రహానికి పూజలు నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: