హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలను నివారించేందుకు, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ జాగృతా దివస్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలీసు విభాగాల్లో గల పాఠశాలలు, కాలేజిలలో 577 సైబర్ అవగాహన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలలో వేలాది మంది విద్యార్థులతో పాటు విద్యావేత్తలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగిన నిపుణులు పాల్గొన్ని సైబర్ నేరాలను ఎలా నివారించాలనే దానిపై చర్చాగోష్టి నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో పాటు ప్రతీ పోలీసు యూనిట్ తమ పరిధిలోని విద్యా సంస్థలతో కలిపి ముఖ్యమైన అంశాలపై విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చింది. ఇందులో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మో సాలు, ఐటెంటిటి థెఫ్ట్, లోన్ మోసాలు, ప్రకటనల మోసాలు, ఆన్లైన్ భద్రతా మోసాలకు సంబంధించి వాటిపై నిపుణులు విపులంగా వివరించారు. దీంతో పాటు విద్యార్థులకు సైబర్ సేఫ్టీ క్విజ్లు, సైబర్ క్రైం (Cybercrime) అంశాలపై చిన్నపాటి నాటకాలు, రెండు నిమిషాల అవగాహన రీల్స్, పోస్టల్ మరియు వకృత్వ పోటీలు నిర్వహించి వీటిలో గెలుపొందిన వారికి బహుమతులు అం దజేశారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల రేపటి పౌరులైన విద్యార్థుల్లో సైబర్ నేరాలపై మరింత అవగాహన కలుగుతుందని, దీంతో పాటు నేరాల నివారణకు ఎలా వ్యవహరించాలనే దానిపై వారికి మంచి ఆలోచన వస్తుందని టిజిసిఎస్బి డైరక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాల్లో జిల్లా పోలీసు అధికారుల, ఎస్ హెచ్లు గెస్ట్ స్పీకర్లుగా వ్యవహరించడంతో పాటు జడ్జిలుగా వుండి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ పోటీల్లో గెలిచిన పోస్టర్లు, నినాదాలు, ముఖ్యమైన సైబర్ భద్రతా సందేశాలు విద్యాసంస్థల సైబర్ ఫ్రీ వాల్ లో ప్రదర్శించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కాగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సైబర్ జాగృతా దివస్ను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యాంశాలను సోషల్ మీడి యాలో షేర్ చేయనున్నారు. కాగా రాష్ట్రంలో ఒకేరోజు సైబర్ నేరాల నివారణకు సంబంధించి 577 కారక్రమాలు జరగడం ఇదే తొలిసారిగా టిజిసిఎసిబి డైరక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు దోహదం చేస్తుందని ఆమె తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :