Crime news: ఆడపిల్లలకు బయటే కాదు ఇంట్లో ఉన్నా వారికి భద్రత లేదు. పిల్లలు ఇంట్లో ఉంటే చాలు వారు జాగ్రత్తగా ఉంటారు అని అనుకునే రోజులు కావు ఇప్పుడు. ఇంట్లో ఒంటరిగా ఉంటే చాలు అగంతకులు లోపలికి జొరబడి, అఘాయిత్యాలకు పాల్పడవచ్చు, హతమార్చనూ
వచ్చు. కూకట్పల్లిలో ఇదే జరిగింది. పదేళ్ల పాప సహస్ర(Sahasra) అభంశుభం తెలియని బాలిక. తల్లిదండ్రుల చాటు బిడ్డ. స్కూల్ కు సెలవిస్తే ఇంట్లోనే ఉంది. కానీ అగంతకుడు ఇంట్లోకి చొరబడి పాపను హతమార్చాడు. ఆ బాలిక ఎంత నరకం అనుభవించిందో తెలియదు.
ఇంకా వీడని మిస్టరీ
సహస్ర హత్య జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా మిస్టరీ వీడలేదు. పోస్టుమార్టంలో బాలిక ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 25 ఏళ్ల వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీంతో బాలిక పోస్ మార్టం(Post mortem) కీలకంగా
మారింది. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు మరింతమందిని ప్రశ్నిస్తున్నారు. సీసీఫుటేజ్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలిసిన వారి పనే: పోలీసులు అనుమానం కాగా సహస్ర పదేళ్ల బాలిక ఒంటరిగా ఉంటో ఉంది. బాలిక తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా సహస్రని దుండగుడు హతమార్చాడు. మధ్యాహ్నం బాలిక తండ్రి ఇంటికి వచ్చినప్పుడు బాలిక హత్యకు గురైంది.
దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. సహస్రపై లైంగిక దాడికి పాల్పడి.. ఆమె తిరస్కరించడంతో హంతకుడు ఆమెను హతమార్చినట్లుగా తెలుస్తున్నది. లేదా ఆ కుటుంబానికి శత్రువులుగా ఉన్నవారు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
నిందితుడు ఎవరు?
పోలీసులు అనుమానితులను విచారిస్తున్నా, ఇంకా నిందితుడిని గుర్తించలేదు. తెలిసిన వ్యక్తే ఈ దాడికి పాల్పడిన అవకాశం ఉంది.
పోలీసుల దర్యాప్తు స్థితి ఏంటి?
సీసీ టీవీ, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: