📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Ranganath:హైకోర్టు ఆగ్రహంతో కమిషనర్ రంగనాథ్ హాజరు — విచారణలో క్షమాపణ

Author Icon By Pooja
Updated: December 5, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath), గత నెల 27న హాజరు కానందుకు తెలంగాణ హైకోర్టుకు(High Court) ఈరోజు క్షమాపణలు తెలిపారు. వరదలు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని, ఆ కారణంగా విచారణకు హాజరు కాలేకపోయానని ఆయన కోర్టులో వివరణ ఇచ్చారు.

Read Also: Emirates Flight: ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు

Commissioner Ranganath appears in court after anger from High Court — apologizes during hearing

బతుకమ్మ కుంట కేసు నేపథ్యం

హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంటకు సంబంధించిన వివాదాస్పద ప్రైవేటు స్థలంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు జూన్ 12న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎ. సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రంగనాథ్ ఈరోజు హాజరయ్యారు.

హైకోర్టు హెచ్చరిక తర్వాత కమిషనర్ హాజరు

అక్టోబర్ 31న కేసు విచారించిన హైకోర్టు, ధిక్కరణ ఎందుకు నమోదు చేయకూడదో నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరై వివరించాలని కమిషనర్‌ను ఆదేశించింది. అయితే బాచుపల్లిలో అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున హాజరుకు మినహాయింపు కోరుతూ రంగనాథ్(Ranganath) మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది దీనిని కోర్టుకు తెలియజేసినా, హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ — “కోర్టు ఆదేశిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కమిషనర్‌ను కోర్టులో నిలబెట్టగలం” అని హెచ్చరించింది. హాజరు మినహాయింపు పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఈరోజు రంగనాథ్ కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

#TelanganaHighCourt BattukammaKuntaCase Google News in Telugu HydRACommissioner' Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.