📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Chiranjeevi: రన్ ఫర్ యూనిటీ’ లో పాల్కొన్న చిరంజీవి 

Author Icon By Sushmitha
Updated: October 31, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ (ఏక్తా దివస్) సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (అక్టోబర్ 31న) ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మరియు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఉత్సాహంగా జరిగింది.

Read Also: Montha Cyclone: మొంథా తుఫాన్‌ బీభత్సం..వరదల్లో ఏడుగురు మృతి

పటేల్ స్ఫూర్తి, చిరంజీవి సందేశం

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత, ధైర్యం మనందరికీ ఆదర్శనీయమని అన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని అందించిన పటేల్‌కు మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ర్యాలీలు యువతకు గొప్ప ప్రేరణనిస్తాయని చిరంజీవి అన్నారు.

డీప్‌ఫేక్, సైబర్ నేరాలపై భరోసా

సాంకేతికతను మంచి కోసం వాడుకోవాలని, డీప్ ఫేక్, సైబర్ నేరాలకు(cyber crimes) ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చిరంజీవి అన్నారు. ఈ అంశాన్ని తాను డీజీపీ, సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లానని, వారు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక చట్టం తీసుకువచ్చేలా ప్రయత్నం జరుగుతోందని, తద్వారా సామాన్యులకు సైతం రక్షణ లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) మాట్లాడుతూ, యువత సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాల విషయంలో ముఖ్యంగా డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, నేరస్థుల మూలాలపై దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Chiranjeevi Cyber Crime Deepfake. Ekta Diwas Google News in Telugu Latest News in Telugu Run for Unity Sardar Vallabhbhai Patel Telugu News Today VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.