చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం – బస్సును ఢీకొన్న కంకర లారీ, రాష్ట్రాన్ని కుదిపేసిన విషాదం
Chevella road accident : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కంకరతో నిండిన లారీ ఆర్టీసీ బస్సును ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, పలువురు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో పురుషులు, మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఢీకొట్టిన ప్రభావంతో లారీలో ఉన్న కంకర బస్సులోకి చేరి, ప్రయాణికులపై పడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. బస్సులో సుమారు 70 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కుడివైపున కూర్చున్న ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో రెస్క్యూ చర్యలు చేపట్టగా, జేసీబీల సాయంతో కంకరలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.
Read Also: : చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రమాదం కారణంగా చేవెళ్ల–వికారాబాద్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
రాష్ట్ర నాయకుల స్పందన (Chevella road accident) :
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంఘటన స్థలానికి మంత్రులు, కలెక్టర్, ఉన్నతాధికారులు వెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
స్థానిక ప్రజల ఆగ్రహం – ఎమ్మెల్యేపై నిరసనలు (Chevella road accident) :
దుర్ఘటన విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, ఆలస్యంగా వచ్చినందుకు స్థానికుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నించడంతో, ఆయన అక్కడినుంచి వెళ్లిపోయారు.
ప్రమాదానికి ప్రధాన కారణాలు(Chevella road accident) :
- టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అధిక వేగంతో రావడం
- లారీలో ఉన్న కంకర బస్సులో పడిపోవడం
- రోడ్డు సన్నగా ఉండటం, గుంతలు ఉండటం
- ఈ రూట్లో భారీ లారీ ట్రాఫిక్ పెరగడం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :