రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఈరోజు ఉదయం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం(Chevella Accident) తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. తాండూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును(RTC bus) కంకరతో నిండిన లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసమై, అందులో ఉన్న 24 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం
మృతులలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌తో(Chevella Accident) పాటు 11 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని అనే ముగ్గురు సోదరీమణులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
రోడ్డుపై రక్తపాతం, హృదయ విదారక దృశ్యాలు
ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ, మరొకరు విద్యార్థిని అయిన వీరు ప్రతిరోజు హైదరాబాద్‌కు ప్రయాణం చేస్తుండేవారు. ఈ రోజు కూడా సాధారణ రోజుగా బయలుదేరిన వారు ఒక్కసారిగా బలవన్మరణం పాలవ్వడం వారి కుటుంబాలను, పరిచయులను షాక్‌కు గురిచేసింది. ఘటన స్థలంలో రోడ్డు మొత్తం ధ్వంసమైన బస్సు భాగాలు, రక్తంతో నిండిన దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. స్థానికులు, రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: