📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

News Telugu: Cat bite – పిల్లులు ఇలా కాటు వేయడానికి కారణాలు ఏంటి..?

Author Icon By Rajitha
Updated: September 21, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లుల కాటు (Cat bite) ఆందోళన కలిగిస్తోంది..! ఇటీవల కాలంలో కుక్కలు, కోతులు మాత్రమే కాదు.. పిల్లులు కూడా దాడులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పిల్లులు పులుల్లా గర్జిస్తూ కొరకడం, గోకడం పెరుగుతోంది. వరంగల్ – హనుమకొండ (Hanmakonda) జిల్లాల్లో ప్రతి నెలా 60కి పైగా పిల్లుల కాటు కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

పిల్లి కాటుతో వచ్చే ప్రమాదం
వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం, పిల్లి కాటు (Cat bite) కూడా కుక్కకాటు, కోతి కాటులాగే ప్రమాదకరమే. సమయానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, Hospital ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు.

కారణాలు ఏమిటి?
చాలామంది ఇళ్లలో పిల్లులను పెంచుకోవడం ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. అయితే వాటిని సరైన విధంగా చూసుకోకపోవడం వల్లే అవి గోర్లతో గాయపరచడం లేదా కొరకడం జరుగుతోంది. నియంత్రణ లేకుండా పిల్లుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక ఆడ పిల్లి నుంచి నాలుగేళ్లలోనే వేల సంఖ్యలో సంతానం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Cat bite

నిపుణుల సూచనలు
పిల్లులను పెంచే ముందు వాటి ప్రవర్తన, పెంపకం గురించి అవగాహన ఉండాలి. పిల్లి, కుక్క, కోతి కాటు వచ్చిన వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వీధిపిల్లుల సంఖ్య నియంత్రణపై అధికారాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెటర్నరీ వైద్యులు సూచిస్తున్నారు.

పిల్లి కాటు ఎందుకు ప్రమాదకరం?
పిల్లి కాటుతో రేబిస్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సమయానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుంది.

వరంగల్ – హనుమకొండ జిల్లాల్లో పిల్లి కాటు కేసులు ఎంత వరకు నమోదవుతున్నాయి?
ప్రతి నెలా సగటున 60కి పైగా పిల్లి కాటు కేసులు నమోదవుతున్నాయి.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tgsrtc-festive-season-bus-fares-heavily-reduced/national/551544/

animal attacks anti rabies vaccine Breaking News cat bite cases latest news rabies awareness Telugu News varangal hanumakonda news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.