📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Camels: కనుమరుగవుతున్న ‘ఎడారి నౌక’లు!

Author Icon By Saritha
Updated: November 27, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ లో యేటా కబేళాలకు చేరుతున్న వందలాది ఒంటెలు

హైదరాబాద్ : మూగజీవాల స్మగ్లింగ్ వాటిని అన్యాయంగా వధిస్తున్న ఘటనలు హైదరాబాద్(Hyderabad) లో అంతకంతకూ పెరిగి పోతున్నాయి. ఇప్పటికే గోవులతోపాటు నెమళ్లు, జింకలు, దుప్పుల వంటి వన్య ప్రాణుల స్మగ్లింగ్తో పాటు వాటిని వధించి మాంసాన్ని విక్రయిస్తుండడం తరచూ వెలుగు చూస్తుండగా ఇప్పుడు ఈ జాబితాలో ఎడారి(Camels) నౌకగా పేరొందిన ఒంటెలు కూడా చేరిపోయాయి. గడచిన కొన్నేళ్లుగా కొందరు వ్యాపారులు ఒంటెలను వధిస్తూ వాటి మాంసాన్ని ఒక పద్ధతిప్రకారం విక్రయిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముందుగా ఒంటెలను ఆయా ప్రాంతాలలో తిప్పుతున్న వ్యాపారులు చిన్న పిల్లలను సవారి చేయిస్తూనే మాంసం కావాలంటే ఇస్తామని ప్రజలను నమ్మబలుకుతూ ముం దుగానే అడ్వాన్సు కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద మూగజీవాల స్మగ్లింగ్, వాటి వధపై సర్కారీ విభాగాలు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లకు మూగజీవులు అన్యాయంగా బలవుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే వేగం గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మాంసాహార ప్రియుల అలవాట్లు రోజు రోజుకూ మారిపోతుండడం. గమనార్హం. నిన్నమొన్నటి వరకు జంట నగరాలలో మాంసాహా రం అంటే చికెన్, మటన్ వరకే ప రిమితమయ్యేది.

Read also: వచ్చే ఆగస్టు రెండున అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం

Hundreds of camels reach the slaughterhouses in Hyderabad every year

పాతబస్తీలో పెరుగుతున్న ఒంటె మాంసం డిమాండ్

పాతబస్తీ(Camels) వంటి కొన్ని ప్రాంతాలలో బీఫ్ వుండేది. కొన్ని సందర్భాలలో దొంగచాటుగా కొందరు వ్యాపారులు జింక, దుప్పి, నెమళ్ల మాంసం తీసుకువచ్చి తమ కస్టమర్లకు ఇచ్చేవారు. ఇప్పుడు చాలా మంది వన్య ప్రాణులతో పాటు ఒంటె మాం స ంపైనా మక్కువ చూపసాగారు. రెండు మూడేళ్లుగా చాటుమాటుగా సాగే ఒంటె మాంసం విక్రయం ఇప్పుడు చాలాచోట్ల అందరి సమక్షంలోనే జరు గుతోంది. ముఖ్యంగా పాతబస్తీలో ఈ మాంసానికి మంచి గిరాకి వుంది. ఒంటె పాలను పసిపిల్లకు తాగిస్తే జీర్ణశక్తి బాగా వుంటుందని ఓ నమ్మకం. ఇదే సమయంలో ఒంటె మాంసం తింటే ఒంట్లో వేడి మరింత పెరిగి ఎక్కువ సమయం ఉత్సాహంగా వుంటుందని, శృంగార సామర్థ్యం పెరుగు తుందని మరికొందరి నమ్మకం. ఈ క్రమంలోనే జంట నగరాలలో ఒంటె మాంసానికి డిమాండ్ ఏర్పడిందని చెప్పాలి. అయితే చికెన్, మటన్, బీఫ్ తరహాలో ఒంటె మాంసాన్ని బహిరంగంగా అమ్మేందుకు చట్టం అంగీకరించదు. తాము ఒంటె మాంసాన్ని అమ్ముతున్నామని ఎవరైనా బహిరంగంగా చెబితే వారిపై చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

రహస్యంగా ఒంటెల వధకు వ్యాపారుల కొత్త పద్ధతులు

ఈ నేపథ్యంలో నగరంలోని కొందరు వ్యాపారులు ఒంటె మాంసం విక్రయం కోసం ఎప్పటికప్పుడు కొత్త పద్దతులను అనుసరించసాగారు. ముందుగా ఒంటెలను రాజస్తాన్ నుంచి వాహనాలలో తెప్పిస్తారు. ఆ తరువాత వీటిని ఒంటె మాంసం ఎక్కు వగా ఇష్టపడే ప్రజలు వుండే ప్రాంతాలలో తిప్పుతారు. ఈ ప్రక్రియ వింతగా వుంటుంది. చిన్నపిల్లలను ఒంటెలపై సవారి చేయిస్తూనే మాంసం గిరా కి కోసం బేరాలు చేస్తారు. అనంతరం తమకు వచ్చే గిరాకి ప్రకారం ఎన్ని ఒంటెలను చంపాలో వ్యాపారులు నిర్ణయిస్తారు. పలానా రోజున, పలానా సమయాన మాంసం అందుతుందని వ్యాపారులు ముందుగానే చెబుతారు. దీని తరువాత వ్యాపారులు ఎంత మాంసం కావాలో బేరీజు వేసుకుని ఒకటి లేదా రెండు ఒంటెలను రహస్య ప్రాంతంలో వధిస్తారు. అనంతరం వాటి మాంసాన్ని తమతో ముందుగా సంప్రదించే వారికి అమ్ముతారు. కొన్ని సందర్భాలలో గిరాకి ఎక్కువగా వుంటే ఎక్కువ సంఖ్యలో ఒంటెలను వధిస్తారు. అయితే ఇటీవల కాలం లో ఒంటెల వధపై హైదరాబాద్లో కొంత నిఘా వుండడంతో వ్యాపారులు ఒంటెల వధ కేంద్రాలను ఇతర ప్రాంతాలకు మార్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Animal Cruelty black market meat camel meat camel smuggling desert ship Hyderabad News illegal wildlife trade indian cities Latest News in Telugu wildlife protection

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.