📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026: ఈసారి స్మార్ట్ అగ్రికల్చర్ బడ్జెట్.. వ్యవసాయానికి రూ.1.50 లక్షల కోట్లు

Author Icon By Rajitha
Updated: January 23, 2026 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2025-26 కంటే రూ.13 లక్షల కోట్లు ఎక్కువ

హైదరాబాద్ : వచ్చే 2026-27 బడ్జెట్లో ప్రధానంగా సంప్రదాయ సాగు విధానాల నుంచి సాంకేతికత ఆధారిత స్మార్ట్ అగ్రికల్చర్ వైపు తీసుకెళ్లే మార్పును లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. తాత్కాలిక సబ్సిడీలకు పరిమితం కాకుండా ఉత్పాదకత, స్థిరత్వం, మార్కెట్ ఆధారిత వృద్ధి దిశగా వ్యవసాయాన్ని తీసుకెళ్లే విధాన నిర్ణయాలు ఈ కొత్త బడ్జెట్లో రూపకల్పన చేస్తోంది. ఈ నేపథ్యంలో 2026-27 కేంద్ర అంచనా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మద్దతును పెంచడానికిగాను దాదాపు రూ.1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత 2025-26 అంచనా బడ్జెట్లో కేంద్రం రూ.1.37 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. దీనికన్నా ఈ సారి రూ.13 లక్షల కోట్లు అదనంగా కేటాయించనున్నట్లు సమాచారం.

Read also: Amaravati : నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

Budget 2026

డిజిటల్ వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, (Agriculture) రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి వెల్లడించిన వివరాలు ప్రకారం ఈసారి బడ్జెట్లో సబ్సిడీ సంస్కరణలు, డిజిటల్ వ్యవసాయం, క్లైమేట్ రెసిలియంట్ పద్ధతులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండనున్నాయి. పశుపోషణ, మత్స్య సంపద, ఉద్యానవనాల వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడంద్వారా రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపడుతుంది. కేంద్రబడ్జెట్ కోసం ప్రాథమిక నివేదికలు, అంచనాల ఆధారంగా కేటాయింపుల పెంపుదల, డిజిటల్ స్వీకరణ, వాతావరణ స్థితి స్థాపక పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగం బలోపేతంపై దృష్టి సారిస్తోంది.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రత్యక్ష నగదు ప్రయోజనాల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల ఆర్థిక సాయాన్ని రూ.8 వేలకు పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వనుంది.

రైతులకు ప్రత్యక్ష మద్దతు, రుణాలు మరియు విత్తన సంస్కరణలు

అలాగే కొత్త బడ్జెట్లో వ్యవసాయ రుణాన్ని పెంచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, మత్స్య, పశుసంవర్ధక రంగాలకు రుణాలను మరింత అందుబాటులోకి తీసుకు రావడంపై దృష్టి సారించి, పూచీకత్తు లేని రుణాల పరిమితిని పొడిగించనుంది. ముఖ్యంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టడం, రైతులను నష్టాల నుండి రక్షించడానికి రూ.30 లక్షల వరకు జరిమానా మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు, మెరుగైన నాణ్యత గల, తెగులు నిరోధక, అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ వైపు ముందుకు సాగడం, మౌలిక సదుపాయాలు, శీతలీకరణ, గిడ్డంగులను పెంచడం. పంటకోత తర్వాత నష్టాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోనుంది. మెరుగైన ధరల కోసం మరిన్ని మండీలను ఈనామ్ ప్లాట్ఫామ్ అనుసంధానించడం, సాంకేతికత, స్థిరమైన డిజిటల్ వ్యవసాయం (అగ్రిస్టాక్) అందుబాటులోకి తీసుకురానుంది. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రైతు డేటా, భూమి రికార్డులు మరియు మార్కెట్ ప్లాట్ ఫారమ్ ఏకీకరణతో సహా డిజిటల్ కార్యక్రమాలకు నిధులను అందించడంలో ప్రధాన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Agriculture budget India Digital agriculture latest news PM Kisan smart farming Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.