హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందంను (Brahmanandam) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి బుధవారం స్వయంగా వెళ్లి, త్వరలో జరగనున్న ‘అలయ్ బలయ్’ (Alay Balay) కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందంకు ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు.
Brahmanandam
బ్రహ్మానందం సంతోషంగా స్పందించారు.
ప్రతి ఏడాది దసరా (Dussehra) సందర్భంగా దత్తాత్రేయ (Dattatreya) ఈ వేడుకను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా (Brahmanandam) నిర్వహిస్తుంటారు. రాజకీయాలు, పార్టీలు, వర్గాలకతీతంగా సమాజంలోని ప్రముఖులు, కళాకారులు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ వేడుక ప్రత్యేకత. ఆహ్వానం పట్ల బ్రహ్మానందం సంతోషంగా స్పందించారు.
బండారు దత్తాత్రేయ ఎందుకు బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు?
త్వరలో జరగనున్న అలయ్ బలాయ్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆయన స్వయంగా బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు.
అలయ్ బలాయ్ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు?
ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: