📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Betting Apps: ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్‌..

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెట్టింగ్స్‌ యాప్స్‌ వల్ల తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు , వీటిని ఎక్కువగా,ప్రమోట్ చేయడంతోనే మరణాల సంఖ్య ఎక్కువవుతోంది.వారి, కుటుంబం వారిపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు,వారు ఇలా అర్దాంతరంగా, తనువూ చలించడం వల్ల వారి కుటుంబానికి కన్నీరే మిగిలింది.ఇటీవల ఈ బెట్టింగ్స్‌ యాప్స్‌ మరణాలు పెరుగుతుండడంతో ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు దిగింది.దీనిలో,భాగంగా పలువురు సినీప్రముఖులకు విచారణకు రావాలంటూ, ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ప్రకాశ్‌రాజ్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు.

సినీప్రముఖులు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో పలువురు సినీప్రముఖులు ఈడీ విచారణకు రావాలంటూ, రానా, ప్రకాష్‌రాజ్‌, మంచులక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈడీ ముందు హాజరయ్యారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెట్టింగ్ యాప్‌ (Betting Apps) లకి సంబంధించి మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ ఫోకస్‌ చేసింది. మొత్తం 36 బెట్టింగ్‌ యాప్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్‌పై సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఓ బెట్టింగ్‌ యాడ్ ప్రమోషన్‌లో ప్రకాష్‌రాజ్ నటించడంతో అతనిపైన కేసు నమోదైంది. 10రోజులక్రితం నోటీసులు ఇవ్వడంతో ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు ప్రకాష్‌రాజ్.బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసుకు సంబంధించి, విచారణకు హాజరు కావాలని టాలీవుడ్‌ ప్రముఖ నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రావాలని

ఈ నెల 23న విచారణకు రావాలని దగ్గుబాటి రానాను ఆదేశించింది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ప్రకాష్‌రాజ్‌కు, ఆగస్టు 13న ఎంక్వైరీకి రావాలని మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది.బెట్టింగ్ యాప్‌లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రావాలని టాలీవుడ్‌ సెలబ్రిటీలను ఆదేశించింది. ఇక ఇదే కేసులో పేర్లున్న మిగతా నటీనటులకు సైతం దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సలర్లపై విచారణ జరుగుతోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది.

బెట్టింగ్ యాప్స్ చట్టబద్ధమా?

భారత్‌లో చాలా బెట్టింగ్ యాప్స్ చట్టబద్ధం కావు. ప్రభుత్వాలు వీటిని నిషేధించే చర్యలు తీసుకుంటున్నాయి.

బెట్టింగ్ యాప్స్ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

యువత డబ్బు త్వరగా సంపాదించాలని ఆకర్షితులై ఈ యాప్స్‌లో డబ్బు పెట్టి పెద్ద నష్టాలను చవిచూస్తున్నారు, చదువు, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: World Tiger Day: పులితోనే జీవవైవిధ్యం

Betting Apps Suicides Telugu States Breaking News ED Notices to Celebrities Government Action on Betting Apps latest news Online Betting Deaths in Andhra Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.