📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Bandi Sanjay: గో సంరక్షకుడి పై దాడి చేసిన నిందితులను శిక్షించాలి

Author Icon By Sushmitha
Updated: October 24, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (కంటోన్మెంట్): గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తుంటే అడ్డుకున్న బజరంగ్ దళ్ కార్యకర్త సోను సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై దాడి జరగడం సరైంది కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం, ఐటీ కారిడార్ వద్ద జరిగిన ఈ ఘటనలో సోను సింగ్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన సోను సింగ్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

Read Also: Kurnool Tragedy: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై విమర్శలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. గోవులను పూజించడం భారతీయ సంస్కృతి అని, గోరక్షకుడిపై దాడి చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఇస్లామ్‌లో గోవులను వధ చేయాలని ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీలకు వత్తాసు పలుకుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గో రక్షకులపై దాడులు జరిగితే కేసీఆర్‌కు పట్టిన గతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మజ్లిస్ ఆగడాలు పెరిగాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు.

కాల్పులకు గురైన గోరక్షకుడి పేరు ఏమిటి?

సోను సింగ్ అలియాస్ ప్రశాంత్.

గో రక్షకుడిపై ఎక్కడ దాడి జరిగింది?

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం, ఐటీ కారిడార్ వద్ద ఈ దాడి జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bandi sanjay BJP. cow vigilantism Google News in Telugu gun attack Hyderabad crime Latest News in Telugu Law and order Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.