📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Bandi Sanjay: మావోయిస్టులతో సంబంధాలు కట్ చేయండి

Author Icon By Sushmitha
Updated: October 22, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలోని కొందరు రాజకీయనాయకులకు మావోయిస్టులతో(Maoist) సంబంధాలు ఉన్నాయని, తక్షణమే వాటిని తెంచుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రంగా హెచ్చరించారు. మావోయిస్టులతో ఉన్న సంబంధాలు తెంచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. వేదికలపై ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ, తెరవెనుక సాయుధ గ్రూపులకు అండగా నిలుస్తున్నవారు వెంటనే తమ సంబంధాలను వదులుకోవాలని, లేకపోతే వారిని బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Read also:  JEE main: జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

లొంగిపోయిన మావోయిస్టుల వ్యాఖ్యలే కారణం

కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు కేవలం మావోయిస్టు కేడర్‌తోనే ఆగిపోవని బండి సంజయ్ హెచ్చరించారు. ఇటీవల మహారాష్ట్రలో లొంగిపోయిన మావోయిస్టు నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకుల రహస్య అండతో మావోయిస్టు పార్టీలోని ఒక వర్గం పనిచేస్తుందని వారు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

నక్సలిజం నిర్మూలన, కఠిన చర్యలు

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) మార్గదర్శకత్వంలో అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న శక్తులను కేంద్రం కనికరం లేకుండా అణిచివేస్తుందని బండి సంజయ్ తెలిపారు. దేశ అంతర్గత భద్రత విషయంలో తప్పు వైపు నిలబడితే ఎంతటి ఉన్నత నాయకులైనా పతనం కాక తప్పదని స్పష్టం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 1,785 మందిని అరెస్టు చేశామని, 477 మందిని మట్టుబెట్టామని ఆయన తెలిపారు.

బండి సంజయ్ ఎవరికి హెచ్చరికలు జారీ చేశారు?

మావోయిస్టులతో సంబంధాలున్న తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

ఈ హెచ్చరికలకు ప్రధాన కారణం ఏమిటి?

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, వాసుదేవరావు చేసిన వ్యాఖ్యలే ఈ హెచ్చరికలకు ప్రధాన కారణం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

: Bandi Sanjay internal security Latest News in Telugu Maoist connections Naxalism political warning. Telangana politics Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.