📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Bandaru Dattatreya: అలయ్ బలయ్ కార్యక్రమం.. హాజరైన ప్రముఖులు

Author Icon By Anusha
Updated: October 3, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ ఏడాది కూడా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం (Alai Balay programme) ఉత్సాహభరితంగా జరిగింది. హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Rajnath Singh: హైదరాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ప్రతి సంవత్సరం దసరా పండుగ (Dussehra festival) ముగిసిన తర్వాతి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున (Nagarjuna), బ్రహ్మానందం, ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీఐ నేత నారాయణ, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం,

Bandaru Dattatreya

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) మాట్లాడుతూ, వేష భాషలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

అందరం ఐక్యంగా ఉండాలనే సదుద్దేశంతో అలయ్ బలయ్ కార్యక్రమం (Alay Balay program) కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. దత్తాత్రేయ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. కొందరు కులం, మతం, వర్గం, జాతి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలు విఫలం కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

alay balay event Bandaru Dattatreya Breaking News Dasara Celebrations Hyderabad latest news nampally exhibition grounds Telugu News vijayalakshmi dattatreya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.