📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Anchor Ravi: యాంకర్ రవిని హెచ్చరించిన వానరసేన..ఆడియోకాల్ వైరల్

Author Icon By Sharanya
Updated: April 11, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెలివిజన్ ప్రేక్షకులకు యాంకర్ రవి పరిచయమైన పేరు. చురుకైన వ్యాఖ్యలతో, చలాకీగా నడిపే యాంకరింగ్‌తో మంచి గుర్తింపు పొందిన రవి ఇప్పుడు ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ టీవీ షోలో ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన “బావగారూ బాగున్నారా” సినిమాలోని ఓ సన్నివేశాన్ని యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ కలిసి స్కిట్ రూపంలో మళ్లీ ప్రదర్శించారు. అయితే, ఆ స్కిట్‌లోని విషయం దేవుడిని నందీశ్వరుడి కొమ్ముల్లోంచి చూడబోతే అమ్మాయి కనిపించడం అనే అంశం హిందూ మతాన్ని కించపరిచిందని అభిప్రాయపడుతున్నారు.

స్కిట్ కంటెంట్ పై తీవ్ర విమర్శలు

ఈ స్కిట్ పై సోషల్ మీడియా వేదికగా హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేవతల పరిమాణాన్ని, భావజాలాన్ని హేళన చేసే విధంగా ప్రదర్శించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా “నందీశ్వరుడి కొమ్ముల్లోంచి అమ్మాయి కనిపించడం” అనే కాన్సెప్ట్ హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేసినట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రీయ వానరసేన గట్టి స్పందన

ఈ వివాదం తీవ్రతను మరింత పెంచింది రాష్ట్రీయ వానరసేన అనే హిందూ సంఘం నుండి వచ్చిన స్పందనతో. ఈ సంఘానికి చెందిన ప్రముఖ సభ్యుడు కేశవరెడ్డి యాంకర్ రవికి ఫోన్ చేసి నేరుగా ప్రశ్నలు సంధించారు. ఆ కాల్ ఆడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయింది, దీనిలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.

లీక్ అయిన కాల్ ఆడియోలో సంభాషణ

అందుకు యాంకర్ రవి బదులిస్తూ మెగాస్టార్ చిరంజీవి బావగారూ బాగున్నారా సినిమాలో చేశారు కాబట్టే తాము ఆ సీన్ ను రీ క్రియేట్ చేశామని బదులిచ్చారు. వాళ్లు తప్పు చేశారని, మీరు కూడా తప్పు చేస్తారా? అని కేశవరెడ్డి అన్నారు. అది తప్పు అని ఎవరూ చెప్పలేదండీ చిరంజీవి గారే చేశారు కదా అని మేం కూడా చేశాం అంటూ రవి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మీరు చేసింది 100 శాతం తప్పండీ హిందువులకు మీరు క్షమాపణలు చెప్పాల్సిందే అని కేశవరెడ్డి స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పాలంటే మీకు ఇగో అడ్డొస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి గారూ మీరు హిందువు కాదా అని కేశవరెడ్డి ప్రశ్నించగా నేను ఇండియన్ అని రవి బదులిచ్చారు. అందుకు కేశవరెడ్డి స్పందిస్తూ ఇండియన్ అని చెప్పి ఇలా హిందువులను కించపరిచే వీడియోలు చేస్తుంటారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ కాల్ ఆడియో బయటకు రావడంతో రవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Read also: SS Rajamouli: ఆస్కార్ కమిటీకి ధ‌న్యవాదాలు తెలిపిన రాజ‌మౌళి

#AnchorRavi #AnchorRaviApology #AnchorRaviControversy #AudioCallLeak #SkitControversy #SudeegaliSudheer #VanarasenaWarning Breaking News Today In Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.